Bhagyashri Borse: అక్కినేని అఖిల్ హీరోగా, మురళి కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ లెనిన్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శనివారం భారీగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన కెరీర్ ఒడిదొడుకులు, సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ వేదికపైనే కన్నీటి పర్యంతమయ్యారు.

థాంక్యూ డైరెక్టర్.. భారతి పాత్ర నా లైఫ్ మార్చేసింది..

తనకు ఇంతటి గుర్తింపు రావడానికి కారణం దర్శకుడు మురళి కిశోర్ అని భాగ్యశ్రీ కొనియాడారు. ఈ చిత్రంలో తను పోషించిన భారతి పాత్ర తన కెరీర్‌లోనే ప్రత్యేకమైనదని చెప్పారు. "నన్ను నమ్మి ఈ పాత్రను ఇచ్చినందుకు, ఈ రోజు నేను ఈ స్థాయిలో నిలబడటానికి కారణమైనందుకు దర్శకుడికి ఎప్పటికీ రుణపడి ఉంటాను" అంటూ కృతజ్ఞతలు తెలిపారు.

అఖిల్.. నువ్వు వచ్చేశావ్: హీరోపై ప్రశంసల జల్లు

సక్సెస్ మీట్ లో హీరో అఖిల్ అక్కినేని గురించి భాగ్యశ్రీ చేసిన వ్యాఖ్యలు హైలైట్‌గా నిలిచాయి. "గత పదేళ్లుగా నీ జర్నీ నాకు తెలియకపోవచ్చు, కానీ ఈ సినిమా కోసం నువ్వు ఎంత రక్తం, చెమట చిందించావో నేను కళ్లారా చూశాను. ఫలితాలు రానప్పుడు ఉండే బాధను దాటుకుని, సెట్‌లో ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా శ్రమించావు. ఈ విజయానికి నువ్వు వంద శాతం అర్హుడివి. పదో తేదీన నీకు సక్సెస్ వస్తుందని ముందే చెప్పాను.. అనుకున్నట్లే అఖిల్, నువ్వు గట్టిగా కంబ్యాక్ ఇచ్చావ్! నీతో మళ్ళీ కలిసి నటించాలని ఉంది.అనీ భాగ్యశ్రీ బోర్సే అన్నారు.

హైదరాబాద్ నా కర్మభూమి.. చివరి సినిమా కూడా ఇక్కడే..

గత ఏడాదిన్నర కాలంగా తాను పడ్డ కష్టాలను గుర్తుచేసుకుంటూ భాగ్యశ్రీ భావోద్వేగానికి గురయ్యారు. తాను కిందపడిపోయిన ప్రతిసారీ తెలుగు అభిమానులు పంపిన మెసేజ్‌లు, చూపించిన ప్రేమే తనను నిలబెట్టాయన్నారు. అభిమానుల రుణం తీర్చుకోలేనిదని చెబుతూ.. "హైదరాబాద్ నా కర్మభూమి. నా సినీ ప్రయాణంలో చివరి సినిమా కూడా ఇక్కడే చేయాలనుకుంటున్నాను" అని ఎమోషనల్ ముగింపు ఇచ్చారు.

మురళి కిశోర్ దర్శకత్వంలో అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన 'లెనిన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా, నవీన్ కుమార్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటర్ బాధ్యతలు నిర్వహించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story