Hyper Aadi: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు అంటేనే అభిమానులకు పండగ వాతావరణం. నిన్న జరిగిన మెగాస్టార్ బర్త్ డే ఈవెంట్ లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. హైపర్ ఆది మెగా అభిమానులను, అక్కడున్న సినీ ప్రముఖులను తనదైన శైలిలో నవ్విస్తూ, ఆలోచింపజేస్తూ ఆది చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

చిరంజీవి గారి గొప్పతనాన్ని, ఆయన ప్రయాణాన్ని వివరిస్తూనే.. ఆది తన ట్రేడ్‌మార్క్ పంచ్‌లతో స్టేజిపై నవ్వుల వర్షం కురిపించారు. మెగాస్టార్ సినిమాలపై ఆయన చెప్పిన డైలాగులు, ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలను కొనియాడిన తీరు అందరినీ ఆకట్టుకున్నాయి. కేవలం కామెడీ మాత్రమే కాకుండా, చిరంజీవి గారిపై తనకున్న అభిమానాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని ఆది ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు. చిరు ముఖంలో చిరునవ్వులు పూయిస్తూ, సభలోని ప్రతి ఒక్కరితో చప్పట్లు కొట్టించారు. మెగాస్టార్‌పై అభిమానంతో హైపర్ ఆది చెప్పిన ఆ మాటలు, వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి

చిరు ప్రయాణం ఇన్సిపిరేషన్: బీవీఎస్ రవి

దర్శకుడు, రచయిత బీవీఎస్ రవి చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని ఆయన ఎంతో మనసారా పంచుకున్నారు. చిరంజీవి వ్యక్తిత్వం, ఆయన సినిమా ప్రయాణం ఎంతో మందికి స్పూర్తిదాయకమని బీవీఎస్ రవి పేర్కొన్నారు. ఇండస్ట్రీలో ఎవరికీ ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చి, కేవలం తన అంకితభావం, నటనతో మెగాస్టార్‌గా ఎదిగిన ఆయన ప్రయాణం ఒక అద్భుతమని కొనియాడారు. కష్టపడే తత్వానికి చిరు సజీవ సాక్ష్యమని చెబుతూ, ఆయనతో తన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. అభిమానుల మధ్య ఈ విషయాలను పంచుకుంటూ రవి చేసిన భావోద్వేగ ప్రసంగం అక్కడున్న అందరినీ ఆకట్టుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story