నటుడిని కాదు: సల్మాన్ ఖాన్

Salman Khan: సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన 'రెడ్‌ సీ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2025' లో సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.ఆయన తను గొప్ప నటుడిని కాదన్నారు "నాకు తెలిసి నేను అంత గొప్ప నటుడిని కాను. నటన ఇప్పుడున్న తరాన్ని వదిలిపెట్టింది. నాకు ఎలా అనిపిస్తే అలా చేస్తాను, అంతే."నటనలో సాంకేతిక పద్ధతుల కంటే, ఆ క్షణంలో తనకు కలిగే అనుభూతిని అనుసరిస్తానని చెప్పారు.భావోద్వేగ సన్నివేశాల గురించి ఆయన సరదాగా మాట్లాడారు. "కొన్నిసార్లు నేను ఏడ్చినప్పుడు, ప్రేక్షకులు నన్ను చూసి నవ్వుతారేమో అని నాకు అనిపిస్తుంది అయితే, వెంటనే ఆ ఫెస్టివల్‌లో ఉన్న ప్రేక్షకులు "లేదు, మేము మీతో పాటు ఏడుస్తాం" అని గట్టిగా చెప్పి, ఆయన వ్యాఖ్యను ఖండించారు.

సినిమాలతో పాటు, తన వ్యక్తిగత జీవితం గురించి కూడా కొన్ని విషయాలను పంచుకున్నారు. సుమారు 25 ఏళ్లుగా తాను సాధారణ డిన్నర్‌ల కోసం బయటకు వెళ్లలేదని, తన జీవితం ఇల్లు, షూటింగ్‌ సెట్‌లు, విమానాశ్రయాలు, హోటళ్ల మధ్యే గడుస్తుందని తెలిపారు.అభిమానులు ఇచ్చే ప్రేమ, గౌరవం కారణంగానే తాను ఈ జీవితాన్ని ఎంచుకున్నానని చెప్పారు. అభిమానులు గుర్తించడం మానేస్తే పిచ్చివాడినైపోతానేమోనని కూడా సరదాగా అన్నారు. ఈ వేదికపై సల్మాన్ ఖాన్ హాలీవుడ్ నటులు ఇద్రిస్ ఎల్బా , జానీ డెప్ వంటి వారితో కలిసి కనిపించడం, ఇద్రిస్ ఎల్బాకు అవార్డును ప్రదానం చేయడం కూడా హైలైట్‌గా నిలిచింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story