Kamal Haasan: విజయ్ కి సలహా ఇచ్చే స్థితిలో నేను లేను
సలహా ఇచ్చే స్థితిలో నేను లేను

Kamal Haasan: కమల్ హాసన్ , విజయ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్‌ను తన శత్రువుగా చూడట్లేదని నిజమైన శత్రువు కులతత్వం (Casteism) అని, దానితో పోరాడటమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. కేరళలో నిర్వహించిన హార్టస్ ఆర్ట్, లిటరేచర్ ఫెస్టివల్‌లో ఆయన మాట్లాడారు. విజయ్‌ను కమల్ హాసన్ తరచుగా "సోదరుడు" అని ఆప్యాయంగా సంబోధిస్తారు.
కొత్తగా పార్టీ (తమిళగ వెట్రి కళగం - TVK) స్థాపించిన విజయ్‌కు సలహా ఇచ్చే స్థితిలో తాను లేనని కమల్ హాసన్ తెలిపారు.అనుభవం మనకన్నా గొప్ప గురువు. అనుభవం నేర్పే పాఠాలు ఎవరూ నేర్పించలేరు, మనుషులకు పక్షపాతం ఉండొచ్చు కానీ అనుభవానికి ఉండదు" అని ఆయన అభిప్రాయపడ్డారు.
విజయ్ రాజకీయాల్లోకి రావాలని కోరుకున్న మొదటి వ్యక్తులలో తాను కూడా ఒకడినని కమల్ హాసన్ గతంలో ఒక సందర్భంలో వెల్లడించారు.తనతో సహా సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఏ నాయకుడికైనా సభలకు వచ్చే భారీ జనం అంతా ఓట్లుగా మారకపోవచ్చని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో ప్రజాభిమానం, సంస్థాగత బలం రెండూ ముఖ్యమని ఆయన అన్నారు.

