ట్రోలర్స్‌కు నటి ప్రగతి గట్టి కౌంటర్

Actress Pragathi: పవర్ లిఫ్టింగ్‌ విషయంలో తనపై జరిగిన ట్రోలింగ్‌పై నటి ప్రగతి స్పందించారు. సరదాగా ప్రారంభించిన పవర్ లిఫ్టింగ్ ఇప్పుడు తనకు ఏకంగా పతకాలు తెచ్చిపెట్టిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ప్రాక్టీస్ ప్రారంభించినప్పుడు తాను ఎదుర్కొన్న ట్రోలింగ్ గురించి ప్రగతి గుర్తు చేసుకున్నారు. "ఈ వయసులో ఇది నీకు అవసరమా?" అంటూ ఎద్దేవా చేశారని, జిమ్ చేస్తున్నప్పుడు తన వస్త్రధారణపైనా విమర్శలు కురిపించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

‘జిమ్‌కు చీర కట్టుకుని కానీ చుడీదార్ వేసుకుని కానీ వెళ్లలేమనే విషయం ట్రోలర్లకు తెలియాలి" అంటూ ఆమె హితవు పలికారు. ఈ ట్రోలింగ్‌ను పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్లడం వల్లే తాను ఈ పతకాలు సాధించగలిగానని చెప్పారు. ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో తాను సాధించిన పతకాలను ఇండస్ట్రీలోని మహిళా ఆర్టిస్టులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. మీరు మాకు ఏమిచ్చినా, ఇవ్వకపోయినా.. కనీసం కొంచెం మర్యాద ఇవ్వండి అంటూ ట్రోలర్స్‌కు ప్రగతి ఘాటు కౌంటర్ ఇచ్చారు.

నటనపై అపారమైన ప్రేమ: "సెట్‌లో కన్నుమూయాలని కోరుకుంటా"

పవర్ లిఫ్టింగ్ వీడియోలు చూసి తాను సినిమాలకు దూరం అవుతున్నానని చాలామంది భావిస్తున్నారని ప్రగతి స్పష్టం చేశారు. అయితే సినిమాలే తనకు ప్రాణమని, నటన ఎన్నటికీ మానలేనని తెలిపారు. నటించకపోతే తాను బతకలేనని, తనకు ఇంత గుర్తింపు రావడానికి కారణం సినిమానే" అని ఆమె అన్నారు. తుదిశ్వాస వరకూ యాక్టింగ్ చేస్తూనే ఉంటానని, చివరికి సెట్‌లోనే కన్నుమూయాలని కోరుకుంటానని ప్రగతి తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story