Dhruv Vikram: సినీ పరిశ్రమలో వ్యక్తిగత విషయాలపై వచ్చే పుకార్లు, ట్రోలింగ్స్ సర్వసాధారణం. అయితే ఇటీవల హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, యువ నటుడు ధ్రువ్ విక్రమ్ తన వ్యక్తిగత జీవితంపై సాగుతున్న ప్రచారాలపై ఓ ఇంటర్వ్యూలో తొలిసారి స్పష్టతనిచ్చారు. ఎవరి పేరూ ప్రస్తావించకుండానే తన గత బ్రేకప్ విషయాన్ని ధ్రువ్ ప్రస్తావిస్తూ, ఆ విడిపోవడం తనపై తీవ్ర మానసిక ప్రభావాన్ని చూపిందని చెప్పారు. ఆ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడటానికి కుటుంబం, అభిమానుల మద్దతే ప్రధాన కారణమని పేర్కొన్నారు. చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టేటప్పుడే ఇలాంటి పరిశీలనలు ఉంటాయని తెలుసని, ఆ సమయంలో తన తల్లి నిరంతరం వెన్నుతట్టి ధైర్యం చెప్పిందని గుర్తుచేసుకున్నారు.

జాయతీగా ఉన్నప్పుడు విమర్శలకు భయపడక్కర్లేదు

తనపై వస్తున్న ప్రచారాలు, విమర్శలు తనను తాకలేదని చెప్పలేనని, కానీ ఇలాంటి పరిస్థితుల్లో మన ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. మనం ఎంచుకున్న మార్గం, మన వ్యక్తిత్వం నిజాయతీగా ఉన్నంతవరకు ఎదుటివారి విమర్శలు మనల్ని ఏమీ చేయలేవని స్పష్టం చేశారు.

సోషల్ మీడియాకు దూరం.. ఎడిటింగ్ అంటే ఇష్టం

చాలామందిలా సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం తనకు అలవాటు లేదని చెప్పారు. తీరిక సమయాల్లో వీడియోలు తీయడం, వాటికి సంగీతం జోడించి ఎడిట్ చేయడం, పుస్తకాలు చదవడం, మ్యూజిక్ వినడమే తన ప్రధాన వ్యాపకాలని వెల్లడించారు. సినిమాల విడుదల లేదా ప్రమోషన్స్ ఉన్నప్పుడు మాత్రమే నెట్టింట యాక్టివ్‌గా ఉంటానని ధ్రువ్ తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story