Sudheer Babu Interesting Comments: నా కష్టంతోనే ఎదిగాను.. సుధీర్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
సుధీర్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Sudheer Babu Interesting Comments: హీరో సుధీర్ బాబు నటించిన కొత్త సినిమా జటాధర విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సుధీర్ మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. "ఒక్క సినిమా చేద్దాం అనుకున్న నేను ఇప్పటికి 20 సినిమాలు పూర్తి చేశాను. ఈ సినిమాల హిట్‌లకు, ఫెయిల్యూర్స్‌కు కారణం నేనే. నేను మహేష్ బాబుగారి బావ, కృష్ణగారి అల్లుడిని కావచ్చు. కానీ మహేష్ సహాయం చేస్తానన్నా కూడా నేను అడగలేదు. నాకు కృష్ణానగర్ కష్టాలు తెలియకపోవచ్చు. కానీ అవకాశాల కోసం చాలా ఆఫీస్‌ల చుట్టూ తిరిగాను. కారులో కూర్చుని బాధపడడం నాకు తెలుసు. ఇవన్నీ సింపతీ కోసం చెప్పట్లేదు. ఈ వేడుకకు వచ్చిన మీరంతా మహేష్‌బాబు గారి ప్రేమతో వచ్చారు. కానీ మీలో ఎవరో ఒకరు నా కోసమే వచ్చి ఉంటారని నా మనసుకు తెలుసు. అందుకే మరింత కష్టపడతాను’’ అని సుధీర్ బాబు అన్నారు.
తన 20 సినిమాల్లో జటాధర స్క్రిప్టే బెస్ట్ అని సుధీర్ బాబు అన్నారు. ఇందులో ఆయన ఘోస్ట్ హంటర్ పాత్ర చేశారు. ఈ సినిమా కోసం శివ తాండవం చేయడం ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని చెప్పారు. ఈ మూవీలో సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ నెల 7న సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేశారు.

