Rakul Preet Singh: ఇంకా గాఢమైన ప్రేమకథ చేయలేదు.. సినీ కెరీర్‌పై రకుల్ ప్రీత్ సింగ్ మనసులోని కోరిక..
మనసులోని కోరిక..

Rakul Preet Singh: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్, తన భవిష్యత్ ప్రాజెక్ట్‌ల ఎంపికపై స్పష్టమైన వైఖరిని వ్యక్తం చేశారు. తన సినీ ప్రయాణంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించినప్పటికీ, హృదయాన్ని కదిలించే పూర్తి స్థాయి ఇంటెన్స్ లవ్ స్టోరీలో నటించే అవకాశం ఇంకా రాలేదని ఆమె పేర్కొన్నారు.
కొత్త జోనర్లలో ప్రయోగాలకు సిద్ధం
కేవలం రెగ్యులర్ రొమాంటిక్ డ్రామాలకే పరిమితం కాకుండా చారిత్రక అంశాలతో కూడిన పీరియడ్ చిత్రాలు, అలాగే హార్రర్ చిత్రాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఉందని రకుల్ తెలిపారు. పెద్ద బ్యానర్లు, స్టార్ లైనప్స్ కంటే కూడా తాను ఎంచుకునే పాత్రలో ఎంత లోతు ఉంది, అది తనలోని నటనను ఏ మేరకు సవాలు చేస్తుందనే అంశాలకే ఇకపై తొలి ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు.
రామాయణంలో శూర్పణఖగా రకుల్ విభిన్న అవతారం
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ అత్యంత భారీ ప్రాజెక్ట్‌లలో భాగమయ్యారు. దర్శకుడు నితీశ్ తివారీ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పౌరాణిక చిత్రం రామాయణంలో ఆమె శూర్పణఖ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, కేజీఎఫ్ స్టార్ యశ్ రావణుడిగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా మొదటి భాగం నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.

