Deepika: డిప్రెషన్ కారణంగానే చాలా విషయాలు తెలుసుకున్నా : దీపిక
చాలా విషయాలు తెలుసుకున్నా

Deepika: ప్రభాస్ స్పిరిట్ నుంచి దీపిక పదుకొణెను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తొలగించిన సంగతి తెలిసిందే. ఎనిమిది గంటల పని దినాన్ని వ్యతిరేకించిన దీపిక దీంతో పాటు, అదనంగా ఇంకా చాలా కండిషన్లు పెట్టడంతో ఈ సినిమా నుంచి తొలగించారని కథనాలొచ్చాయి. బాలింత తల్లులకు పని చేసే సమయాన్ని ఆరు గంటలకే పరిమితం చేయాలని దీపిక కోరినట్టు కూడా వార్తలొచ్చాయి. అదంతా కాసేపు పక్కనబెడితే ఇప్పుడామె సెట్లో ఆర్టిస్టులు, సిబ్బందికి పని గంటలు, సౌకర్యాల హక్కుల విషయంలో తాను చాలా కాలంగా పోరాడుతున్నట్టు వెల్లడించింది. 'సెట్లలో 8 గంటలకు మించి పని చేసే సిబ్బందిని చూస్తున్నాను. ఉదయం తొందరగా వస్తారు. డ్యూటీ ముగిసాక కూడా చాలా ఆలస్యంగా ఇంటికి వెళతారు. ఇది సరికాదు. ఎక్కువ సమయం పని చేస్తే, చేసిన పనికి గంటల లెక్కన వారికి అదనపు భత్యం చాలి' అని డిమాండ్ చేసింది. హీరోలు, దర్శకుల వంటి వారు అదనపు పని గంటలు పని చేస్తే రివార్డులు దక్కుతాయని, సిబ్బందికి అలాంటి పరిస్థితు లు ఉండవని పేర్కొంది. అధిక పని ఒత్తిడి ప్రొడక్ట్ నాణ్యతపై ప్రభావం చూపుతుందనేది ఆమె వాదన. డిప్రెషన్ కారణంగానే తాను చాలా విషయాలు తెలుసుకున్నట్లు చెప్పింది.
