నాది కీలక రోల్ చేశా:బ్రహ్మానందం

Brahmanandam: హాస్యనటుడు బ్రహ్మానందం నటించిన తాజా చిత్రం 'గుర్రంపాపిరెడ్డి' సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రి రిలీజ్ ఈవెంట్ లో బ్రహ్మానందం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమా ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అని ఆయన తెలిపారు. చాలా కాలం తర్వాత నాకు పూర్తిస్థాయి వినోదాత్మకమైన పాత్ర దొరికింది. ఇందులో నా క్యారెక్టర్ పేరు మీదనే సినిమా టైటిల్ ఉండటం విశేషం. ప్రేక్షకులు మనసారా నవ్వుకునేలా ఈ పాత్ర ఉంటుంది," అని ఆయన పేర్కొన్నారు. దర్శకుడు మురళీ మనోహర్ యాదవ్ ఈ కథను మలిచిన తీరు చాలా బాగుందని, నేటి కాలానికి తగ్గట్టుగా కామెడీని డిజైన్ చేశారని ప్రశంసించారు.

గుర్రంపాపిరెడ్డి" అనేది బ్రహ్మానందం రీ-ఎంట్రీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రాలలో ఒకటి కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. బ్రహ్మానందం మార్కు కామెడీని మళ్ళీ వెండితెరపై చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బ్రహ్మానందంతో పాటు వెన్నెల కిషోర్, సత్య వంటి నేటితరం కామెడీ స్టార్స్ కూడా నటించారు.ఇటీవల విడుదలైన టీజర్ , సాంగ్స్ (ముఖ్యంగా 'గుర్రంపాపిరెడ్డి' టైటిల్ సాంగ్) సోషల్ మీడియాలో మంచి వ్యూస్ సాధించాయి.ఈ సినిమా డిసెంబర్ 19న విడుదల కానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story