BhagyaShri Borse’s Emotional Words: కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘సెయాన్‌’పై (Seyon) ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. 'అమరన్‌' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత శివకార్తికేయన్‌... లోకనాయకుడు కమల్ హాసన్‌కు చెందిన సొంత నిర్మాణ సంస్థ 'రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్' బ్యానర్‌లో నటిస్తున్న రెండో క్రేజీ ప్రాజెక్ట్ ఇది.

ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న టాలెంటెడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే తాజాగా లెజెండరీ నటుడు కమల్‌ హాసన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో దిగిన క్యూట్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కమల్ సార్‌ను కలవడంపై భాగ్యశ్రీ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

"డియర్‌ కమల్‌ హాసన్‌ సర్‌.. చిన్నప్పటినుంచి మిమ్మల్ని స్క్రీన్‌పై చూస్తూ పెరిగాను. ఇప్పుడు అదే చిన్న అమ్మాయి మీ నిర్మాణంలో వస్తున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మీరు నా తలపై చేయి వేసి ఆశీర్వదించిన క్షణాలను వర్ణించడానికి నా దగ్గర మాటలు సరిపోవడం లేదు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, మీరు గర్వపడేలా చేస్తానని ప్రామిస్‌ చేస్తున్నా" అంటూ భాగ్యశ్రీ మురిసిపోయారు.

శివకుమార్‌ మురుగేశన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘సెయాన్‌’ చిత్రం పక్కా గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమా అని చిత్రబృందం తెలిపింది. కుటుంబ ప్రేక్షకుల్ని అలరించే బలమైన భావోద్వేగాలు, మాస్‌ యాక్షన్ ఎలిమెంట్స్, చక్కటి వినోదాన్ని మిళితం చేస్తూ ఈ కథను రూపొందించారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా అక్టోబరులో థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.

Next Story