కానీ కథలే రావట్లేదు - శివకార్తికేయన్

Sivakarthikeyan: తనదైన టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించే శివకార్తికేయన్, ఇటీవల కాలంలో వరుసగా సీరియస్ సినిమాలతో పలకరిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన పరాశక్తి చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడంతో ఆ సినిమా ఫలితంపై, తన తదుపరి సినిమాలపై ఆయన మనసు విప్పారు.

కామెడీకి దూరమవ్వడంపై క్లారిటీ

చాలా కాలంగా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రాల్లో శివకార్తికేయన్ కనిపించడం లేదని అభిమానులు ఫీల్ అవుతున్నారు. తన వద్దకు ప్రస్తుతం ఎవరూ ఫుల్‌లెంగ్త్ కామెడీ స్క్రిప్ట్‌లు తీసుకురావడం లేదని ఆయన వెల్లడించారు.అమరన్, పరాశక్తి వంటి సినిమాలు తనలోని నటుడిని కొత్తగా పరిచయం చేశాయని, అయితే ఒక ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించడాన్ని తానూ మిస్ అవుతున్నానని తెలిపారు. ప్రస్తుతం ఒక మంచి వినోదాత్మక కథను ఎంచుకునే పనిలో ఉన్నానని, త్వరలోనే దీనిపై గుడ్ న్యూస్ చెబుతానని హామీ ఇచ్చారు.

పరాశక్తి’పై వివాదాలు - నెగెటివిటీ

సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన పరాశక్తి సినిమా విడుదలకు ముందు నుంచే అనేక వివాదాలను ఎదుర్కొంది. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణాలపై శివకార్తికేయన్ స్పందిస్తూ.. సినిమాలో వినోదం తక్కువగా ఉండటం ఒక కారణమైతే ఉద్దేశపూర్వకంగా జరిగిన నెగెటివ్ ప్రచారం సినిమా ఆదరణను దెబ్బతీసిందని చిత్ర బృందం భావిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story