ఇప్పటికీ భయం..జబర్దస్త్ నరేశ్ ఎమోషనల్

Jabardasth Naresh Emotional: జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువై, చిన్నపిల్లాడి పాత్రలతో నవ్వులు పంచుతున్న కమెడియన్ నరేశ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘‘కష్టం అంటే ఎలా ఉంటుందో నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతూనే వచ్చాను. అలాంటి కష్టాలు మళ్లీ రాకూడదని కోరుకుంటాను" అని నరేశ్ ఎమోషనల్‌గా మాట్లాడాడు.

వాస్తవానికి ఢీ జూనియర్స్ కోసం వచ్చిన తాను, అనూహ్యంగా సుధాకర్, చంటి సహకారంతో జబర్దస్త్ వైపు వెళ్లినట్లు తెలిపాడు. అప్పటి నుంచి దాదాపు 600 స్కిట్స్ వరకూ చేశానని చెప్పాడు. తనను చాలామంది కమర్షియల్ అని అనుకుంటారని.. కానీ అలాంటిదేమీ లేదని నరేశ్ స్పష్టం చేశాడు. వ్యక్తిగత సమస్యలు వస్తే ముందుగా హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్‌కు చెప్పుకుంటానని తెలిపాడు. అయితే "కొంతమంది మాత్రం డబ్బు విషయంలో నన్ను మోసం చేశారు. ఆ నష్టం నుంచి తేరుకోవడానికి కొంత సమయం పట్టింది" అని తన చేదు అనుభవాన్ని పంచుకున్నాడు.

భవిష్యత్తుపై భయం

పండుగల సమయంలో ఈవెంట్లు ఎక్కువగా ఉంటాయని, అయితే తాను పారితోషికం విషయంలో ఎవరినీ డిమాండ్ చేయనని నరేశ్ చెప్పాడు. "ఎవరితో ఎలాంటి వివాదాల జోలికి వెళ్లను. పగలు, ప్రతీకారాలు అంటూ మనసు పాడుచేసుకోకుండా హ్యాపీగా ఉండటానికే ప్రయత్నిస్తాను" అని తెలిపాడు. కాకపోతే, "అవకాశాలు ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడు ఉండవో తెలియదు గనుక, అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది" అని తన మనసులోని ఆందోళనను బయటపెట్టాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story