Actress Shweta Menon: ఆ నిందితులను ఎప్పటికీ రానివ్వను.. ఎంతకైనా తెగిస్తా: నటి శ్వేతా మేనన్ హాట్ కామెంట్స్
నటి శ్వేతా మేనన్ హాట్ కామెంట్స్

Actress Shweta Menon: మలయాళ చిత్రసీమలో హెమా కమిటీ నివేదిక కలకలం రేపుతున్న వేళ... మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'అమ్మ' అధ్యక్షురాలు, ప్రముఖ నటి శ్వేతా మేనన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంపై ఆమె మరోసారి ఘాటుగా స్పందించారు.
తనపై వస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ... "నేను ఈ పదవిలో ఉన్నంత కాలం, హేమా కమిటీ నివేదికలో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పవర్ గ్రూప్ వాళ్లను ఏ ఒక్కరినీ 'అమ్మ' సంఘం బాధ్యతల్లోకి రానివ్వను" అని తెగేసి చెప్పారు శ్వేతా మేనన్. బాధ్యులకు పదవులు దక్కకుండా చేసేందుకు ఎలాంటి నిర్ణయానికైనా, ఎంతటి పోరాటానికైనా వెనుకాడనని స్పష్టం చేశారు.
ఈ నివేదికలో నిందితులుగా ఉన్న కొందరి ఆర్థిక అక్రమాలను ప్రశ్నించినందుకే, తనపై కావాలని వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ వివాదాన్ని పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె మండిపడ్డారు. నిజం గెలవాలన్నదే తన ఏకైక లక్ష్యమని... 'అమ్మ' సంఘానికి మళ్లీ మంచి రోజులు వస్తాయని నటి శ్వేతా మేనన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

