సినిమాల వేగంపై అలియా భట్ కీలక వ్యాఖ్యలు..

Alia Bhatt Makes Key Comments: ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా గడిపిన అలియా భట్, ఇప్పుడు తన పని తీరును పూర్తిగా మార్చుకున్నారు. కూతురు రాహా రాకతో తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. గతంలో లాగా ఒకే సమయంలో రెండు మూడు ప్రాజెక్టులను అంగీకరించకూడదని అలియా నిర్ణయించుకున్నారు. ఇప్పుడు కేవలం ఒకే సినిమాపై దృష్టి పెడుతూ, ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. తల్లిగా బాధ్యతలు పెరగడం వల్ల సినిమాల వేగం తగ్గించానని, అయితే ఈ మార్పు తనకు ఎంతో సంతోషాన్ని, తృప్తిని ఇస్తోందని ఆమె అన్నారు.

బిడ్డ పుట్టిన తర్వాత శరీరం సహకరించడం కష్టమని చాలామంది భావిస్తారు. కానీ అలియా ప్రస్తుతం నటిస్తున్న స్పై థ్రిల్లర్ ఆల్ఫా కోసం భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లలో పాల్గొంటున్నారు. ఇది తన శారీరక సామర్థ్యాన్ని తనకు గుర్తింపజేసిందని, తన శరీరం పట్ల గౌరవం పెరిగిందని ఆమె చెప్పుకొచ్చారు. 2026లో అలియా భట్ ఆల్ఫా, సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న లవ్‌ అండ్‌ వార్‌ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story