తనకు అవకాశం వస్తే.. పవన్‌ క్యలాణ్‌కు అవరా్డు ఇవ్వాలని ఉందన్నారు ఇస్మార్ట్‌ శంకర్‌ ఫేమ్‌ కావ్య థాపర్‌. తన రోల్‌ మోడల్‌ ఎవరన్న ప్రశ్నకు ఏ ఒక్కరినో ప్రత్యేకించి చెప్పడం కష్టమన్న కావ్య థాపర్‌.. పవన కల్యాణ్‌కు మాత్రం ఒక అవార్డ్‌ ఇవ్వాలనిపిస్తోందన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఇండియన్‌ ఐకన్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో పాల్గొన్న కరణ్‌ థాపర్‌.. పొలిటెంట్ మీడియాకు ఇచ్చిన స్పెషల్‌ ఇంటర్వ్యూలో తన ఒపీనియన్‌ షేర్‌ చేసుకున్నారు.



రవితేజ, సంజయ్‌లతో పనిచేసిన అనుభవం గురించి చెబుతూ, వారిని చిన్నప్పటి నుంచే తెరపై చూస్తూ పెరిగానని, ఇప్పుడు వారితో స్క్రీన్‌ షేర్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. తన డ్రీమ్ కో-ఆర్టిస్ట్ ఎవరు? అనే ప్రశ్నకు, తనకు ఎవరితోనైనా పనిచేయాలని ఉందని, ఏ ఒక్కరినీ ప్రత్యేకంగా ఫిక్స్ చేయలేనని, ప్రతి ఒక్కరితోనూ పనిచేయాలని ఉందని తనదైన శైలిలో సమాధానమిచ్చారు.



ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ కార్యక్రమం నిజంగా అద్భుతమైన అనుభవం అని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తమ తమ రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని, వాళ్లు.. అందుకున్న అవార్డులు వారి కష్టానికి గుర్తింపుగా నిలుస్తున్నాయన్నారు. ఇది తనకు కూడా ఎంతో ప్రేరణనిచ్చిందని కావ్య తెలిపారు.



తన మొదటి అవార్డు గురించి గుర్తు చేసుకుంటూ రెండేళ్ల క్రితం తనకు గోల్డెన్ ఐకాన్స్ అవార్డు లభించిందని, స్కూల్ రోజుల్లోనూ నటన, క్రీడల కోసం కొన్ని బహుమతులు వచ్చాయి కానీ, చదువులో రాలేదని చిరునవ్వుతో చెప్పారు.



ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో ఆమె పలు ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నారు. గత ఏడాది నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. తర్వాత కొంత బ్రేక్ తీసుకొని ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్‌పై పనిచేస్తున్నానని, ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్‌లో ఉన్నానని, ఇంకొన్ని ప్రాజెక్ట్స్ ప్లానింగ్‌లో ఉన్నాయని వివరించారు.


Politent News Web4

Politent News Web4

Next Story