Actress Samantha: నచ్చకపోతే బ్లాక్ చేస్తా.. విమర్శకులకు సామ్ వార్నింగ్..
విమర్శకులకు సామ్ వార్నింగ్..

Actress Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ వెండితెరపై తన మార్క్ చూపించడానికి సిద్ధమైంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సామ్, తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ తనపై వచ్చే ట్రోల్స్‌పై, నేటి సోషల్ మీడియా వ్యసనంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
నా డిజిటల్ స్పేస్‌లో నెగిటివిటీకి చోటు లేదు..
తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్యంపై వచ్చే నెగెటివ్ కామెంట్లను సమంత ఏమాత్రం పట్టించుకోనని తేల్చి చెప్పారు. "నేను నా ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటానో, నా సోషల్ మీడియా పేజీని కూడా అంతే ప్రశాంతంగా ఉంచుకోవాలని భావిస్తాను. అందుకే ఎవరైనా కావాలని నెగిటివిటీని వ్యాపింపజేస్తే మాత్రం సహించను" అని ఆమె హెచ్చరించారు.
బ్లాక్ అంటే భయం కాదు:
ఎవరినైనా బ్లాక్ చేశానంటే వారు తనను బాధపెట్టినట్టు కాదు, కేవలం తన ప్రపంచంలోకి వారికి ప్రవేశం లేదని అర్థమని స్పష్టం చేశారు. నేటి తరం రీల్స్ చూస్తూ ఏకాగ్రతను కోల్పోవడంపై సమంత ఆందోళన వ్యక్తం చేశారు. "రీల్స్ చూస్తూ సమయం వృథా చేయడం వల్ల ఫోకస్ దెబ్బతింటోందేమో అని నాకు భయం వేస్తోంది. అందుకే ఆ అలవాటు నుంచి బయటపడటానికి నేను పుస్తకాలు చదవడం, పాడ్‌కాస్ట్‌లు వినడం లాంటి నియమాలను పాటిస్తున్నాను" అని ఆమె తెలిపారు.
వేగంగా సాగుతున్న మా ఇంటి బంగారం షూటింగ్
సమంత సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం ఆమె నందినీ రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం అనే యాక్షన్ డ్రామాలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని మే 15న సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

