రష్మిక బోల్డ్ కామెంట్స్

Rashmika’s Bold Comments: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన రాబోయే చిత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్' ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో జగపతి బాబు హోస్ట్ చేస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' అనే టాక్ షోలో పాల్గొని, పీరియడ్స్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "మగాళ్లకు కూడా ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి, ఆ బాధ ఏంటో తెలియాలి.మహిళలు ఆ సమయంలో పడే నొప్పి, బాధ, అలసట, మానసిక కల్లోలం (మూడ్ స్వింగ్స్) గురించి మగవారికి అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది.మగవారు ఆ నొప్పిని అనుభవిస్తే, వారు మహిళల పరిస్థితులను మరింత గౌరవిస్తారు .వారి భావాలను సరిగ్గా అర్థం చేసుకుంటారు.

ఆమె ఇచ్చిన ఈ బోల్డ్, ఎమోషనల్ సమాధానానికి షోలో ఉన్న ప్రేక్షకులు, జగపతి బాబు సైతం చప్పట్లతో ఆమెను అభినందించారు. రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహిళలు అనుభవించే కష్టాలను మగవారు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారని ప్రశంసలు కూడా వస్తున్నాయి.

'ది గర్ల్ ఫ్రెండ్' మూవీలో దీక్షిత్ శెట్టి సరసన రష్మిక నటించింది. ఈ మూవీలో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రలో యాక్ట్ చేసింది. ఈ చిత్రం ఒక లేడీ ఓరియెంటెడ్ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా.

ఇది ఒక రిలేషన్‌షిప్‌లోని ప్రేమ, ఆత్మగౌరవం, బ్రేకప్ బాధ, ఒత్తిడి వంటి వాస్తవిక భావోద్వేగాలను ప్రదర్శిస్తుందని తెలుస్తోంది.ది గర్ల్‌ఫ్రెండ్' సినిమా నవంబర్ 7న విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల అవుతోంది. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డును సృష్టిస్తుందో చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story