Keerthy Suresh: మళ్లీ లాక్ డౌన్ వస్తే ఆ హీరో ఫ్యామిలీతో ఉంటా : కీర్తి సురేశ్
ఆ హీరో ఫ్యామిలీతో ఉంటా : కీర్తి సురేశ్

Keerthy Suresh: టాలీవుడ్ ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ నానీ, నటి కీర్తి సురేశ్ కాంబినే షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరిది సక్సెస్ఫుల్ కలయిక. నానీ, కీర్తి జంటగా తొలిసారి నటించిన నేను లోకల్ మూవీ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన దసరా సినిమాతో ఏకంగా వంద కోట్ల క్లబ్లో చేరిపోయారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన పీరియాడిక్ చిత్రం భారీ మాస్ హిట్ గా నిలవడంతో నేచురల్ స్టార్ క్రేజ్ షూస్ లో రెట్టింపు అయింది. ఇక కీర్తికి కూడా ఈ రెండు మూవీలు గొప్ప సక్సెస్ అందించాయి. ఆమె ఇతర హీరోలతో కొన్ని సినిమాలు చేసినప్పటికీ.. ఆశించిన రేంజ్ లో ఫలితాలు రాలేదు. నేచురల్ స్టార్ తో మాత్రం ఆమెకు కలిసొచ్చిందని చెప్పొచ్చు. మహానటి చిత్రానికి కూడా కీర్తి సురేష్ పేరుని స్వప్నతో నాని రిఫర్ చేసినట్టుగా తెలిసిందే. నానితో ఆన్ స్క్రీన్ మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లో మంచి బాండింగ్‌ను కీర్తి సురేష్ మెయింటైన్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇద్దరు హాట్రిక్ మూవీ ఎప్పుడు చేస్తారనే చర్చ అభిమానుల్లో మొదలైంది. ప్రస్తుతం లైనప్ లో ఉన్న నాని నటిస్తోన్న ఏ మూవీలోనూ కీర్తి పేరు వినిపించడం లేదు. ఆమె కూడా ప్రస్తుతం బిజీగానే ఉంది. తెలుగు, హిందీతో పాటు పలు తమిళ సినిమాలు చేస్తోంది. తాజాగా కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నాని ఫ్యామిలీ గురించి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. మళ్లీ లాక్ డౌన్ వస్తే ఏ ముగ్గురు సెలెబ్రిటీలతో ఉండాలని అనుకుంటున్నావ్ అని కీర్తి సురేష్‌ను ప్రశ్నించారు. నాని, నాని భార్య అంజు, స్వప్న అని ముగ్గురి పేర్లను కీర్తి సురేష్ వెల్లడించారు.
