సమర్పించిన ఇళయరాజా

Ilaiyaraaja : ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ఉన్న కొల్లూరు మూకాంబిక అమ్మవారి ఆలయాన్ని దర్శించారు. ఈ సందర్భంగా ఆయన రూ.4 కోట్ల విలువైన వజ్రాలతో అలంకరించిన వెండి కిరీటాన్ని అమ్మవారికి సమర్పించారు. అలాగే, వీరభద్ర స్వామికి వెండితో చేసిన ఆయుధం (కత్తి)ని బహూకరించారు. పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత అర్చకులు ఇళయరాజాకు తీర్థ ప్రసాదాలతో పాటు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఇళయరాజా తన కుమారుడు కార్తిక్, మనవడు యతీశ్ తదితరులతో కలిసి ఆలయానికి విచ్చేశారు.

ఇళయరాజా మాట్లాడుతూ, జగన్మాత మూకాంబిక అమ్మవారి ఆశీస్సుల వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని, తాను చేసింది ఏమీ లేదని వినమ్రంగా తెలిపారు. మూకాంబిక ఆలయ మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్ బాబు శెట్టి మాట్లాడుతూ, ‘‘ఇళయరాజా సాధారణ భక్తుడిగా ఈ ఆలయాన్ని తరచూ సందర్శిస్తారు. గతంలో 2006లో కూడా ఆయన అమ్మవారికి ఒక కిరీటాన్ని సమర్పించారు’’ అని పేర్కొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story