జాన్వీకపూర్ ఫన్నీ కామెంట్స్..

Janhvi Kapoor: నటి జాన్వీకపూర్ ప్రస్తుతం ‘పరమ్‌ సుందరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఐఎమ్‌డీబీ నిర్వహించిన ‘స్పీడ్‌ డేటింగ్’ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ, విదేశాలకు వెళ్లినప్పుడు యువకులు తన వెంటపడకుండా ఉండేందుకు తనకు పెళ్లయిందని చెబుతానని వెల్లడించారు.

‘‘నేను ఇప్పటికి చాలాసార్లు నాకు వివాహమైందని చెప్పాను. విదేశాలకు వెళ్ళినప్పుడు చాలామంది యువకులు నాతో స్నేహం చేయడానికి ప్రయత్నించేవారు. కొన్నిసార్లు రిసార్ట్స్, హోటల్స్‌కు వెళ్ళినప్పుడు నేను అడగకుండానే ప్రత్యేకమైన వంటకాలను తెచ్చి ఇచ్చేవారు. ఒకసారి లాస్ ఏంజిల్స్‌కు వెళ్లినప్పుడు, అక్కడ హోటల్ వారికి ఓర్రీ నా భర్త అని చెప్పా’’ అని జాన్వీ నవ్వుతూ చెప్పారు. ఓర్రీ బాలీవుడ్‌లో ఒక ఫ్యాషన్ డిజైనర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. చాలామంది బాలీవుడ్ ప్రముఖులతో అతనికి మంచి స్నేహం ఉంది.

ప్రేమంటే అదే..

ఈ ఇంటర్వ్యూలో జాన్వీ తన ప్రేమ గురించి కూడా మాట్లాడారు. ప్రేమ అంటే కేవలం రొమాన్స్ మాత్రమే కాదని, ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర అవగాహన ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలబడటమే తన దృష్టిలో నిజమైన ప్రేమ అని ఆమె పేర్కొన్నారు. ఒకసారి తనను కలవడానికి లండన్ నుండి ఒక వ్యక్తి ముంబైకి వచ్చాడన్న కల వచ్చిందని, అది తనను ఉలిక్కిపడి నిద్రలేపేలా చేసిందని కూడా జాన్వీ సరదాగా పంచుకున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story