Samantha Makes a Promise to Fans: ఏడాదికి రెండు సినిమాలు చేస్తా.. ఫ్యాన్స్‌కు సమంత ప్రామిస్
ఫ్యాన్స్‌కు సమంత ప్రామిస్

Samantha Makes a Promise to Fans: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్‌లో.. సెన్సిబుల్ డైరెక్టర్ నందినీ రెడ్డి తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మా ఇంటి బంగారం’. సమంతకు చెందిన 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. దిగంత్, గుల్షన్ దేవయ్య, సీనియర్ నటి గౌతమి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం.. జూన్ 19న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ మంగళవారం హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది.
ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు డి.సురేష్ బాబు, మైత్రీ రవి శంకర్, స్వప్నాదత్, జాన్వీ నారంగ్, స్టార్ డైరెక్టర్ దేవా కట్టా అతిథులుగా హాజరయ్యారు. ‘మా ఇంటి బంగారం’ సినిమా పెద్ద సక్సెస్ సాధించాలని, సమంతకు ప్రొడ్యూసర్‌గా ఈ చిత్రం గ్రాండ్ వెల్‌కమ్ చెప్పాలని వారంతా విష్ చేశారు.
ఇక ఈ ఈవెంట్‌లో సమంత మాట్లాడిన మాటలు అభిమానుల్లో జోష్ నింపాయి. "నా నుంచి సినిమా వచ్చి మూడేళ్లు అవుతున్నా.. నాపై రవ్వంత కూడా ప్రేమ తగ్గకుండా చూపిస్తున్న ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్" అంటూ సమంత ఎమోషనల్ అయ్యారు. ఇకపై గ్యాప్ లేకుండా ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేస్తానని ఫ్యాన్స్‌కు ప్రామిస్ చేశారు. అలాగే.. "ఇప్పటివరకు నటిగా నేను ఎంత ఎంజాయ్ చేశానో.. ఒక నిర్మాతగా ఉండే కష్టాలు, బాధ్యతలు ఇప్పుడు నాకు తెలుస్తున్నాయి. ఈ సినిమా కోసం ప్రతి డిపార్ట్‌మెంట్ ప్రాణం పెట్టి పని చేసింది. రాజ్ అండ్ డీకే, నందినీ రెడ్డి నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. అందరినీ ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుంది" అని సమంత ధీమా వ్యక్తం చేశారు.
అనంతరం దర్శకురాలు నందినీ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటివరకు వెండితెరపై చూసిన సమంత కంటే.. పది రెట్ల పవర్‌ఫుల్ సమంతను ఈ సినిమాలో చూస్తారని స్టేజ్ పైనే బల్లగుద్ది చెప్పారు. తమకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతి ఒక్కరికీ నిర్మాత రాజ్ నిడిమోరు కృతజ్ఞతలు తెలిపారు. మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత సమంత నుంచి వస్తున్న సినిమా కావడంతో.. ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి!

