నవీన్ పొలిశెట్టి అదిరిపోయే పంచ్

Naveen Polishetty’s Hilarious Punchline: సంక్రాంతి రేసులో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైన నవీన్ పొలిశెట్టి, సినిమా ప్రచారంలో భాగంగా తనదైన శైలిలో నవ్వులు పూయించారు. ముఖ్యంగా తన వివాహంపై వస్తున్న వార్తలకు ఆయన ఇచ్చిన సమాధానం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. నవీన్ పెళ్లి ఎప్పుడు? అని విలేకరులు ప్రశ్నించగా.. "డార్లింగ్ ప్రభాస్ అన్నయ్య పెళ్లి చేసుకున్న సరిగ్గా 12 గంటల తర్వాతే నేను కూడా పీటలు ఎక్కుతాను" అంటూ సెటైరికల్‌గా సమాధానమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

గోదావరి వెటకారంతో రాజు

ఈ చిత్రంలో నవీన్ ఒక కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నారు. "గోదావరి జిల్లాల వెటకారంతో కూడిన ఈ పాత్ర నా గత సినిమాలకు భిన్నంగా ఉంటుంది. ఇందులో సరికొత్త నవీన్ పొలిశెట్టిని చూస్తారు" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సంక్రాంతికి పెద్ద సినిమాలు పోటీగా ఉన్నా తను ఏమాత్రం భయపడటం లేదని నవీన్ చెప్పారు. "చిరంజీవి గారు మా అందరికీ గురువు, స్ఫూర్తి ప్రదాత. ఆయన సినిమాతో పాటే నా సినిమా రావడం ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది" అని తెలిపారు.

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ముంబైలో పెళ్లిళ్లకు హోస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, నేడు స్టార్ హీరోగా ఎదిగిన తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్న నవీన్, కష్టాలే తనను ఈ స్థాయికి చేర్చాయని భావోద్వేగానికి లోనయ్యారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story