Actress Prema: సరైన వ్యక్తి దొరికితే 70 ఏళ్ల వయసులోనైనా పెళ్లి చేసుకుంటా.. నటి ప్రేమ బోల్డ్ కామెంట్స్
నటి ప్రేమ బోల్డ్ కామెంట్స్

Actress Prema: తెలుగు, కన్నడ సినీ పరిశ్రమల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నటి ప్రేమ.. తన వ్యక్తిగత జీవితం, రెండో పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. జీవిత ప్రయాణంలో తోడు అనేది చాలా అవసరమని, తనను అర్థం చేసుకునే సరైన భాగస్వామి దొరికితే మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమేనని ఆమె స్పష్టం చేశారు.
విడాకులపై స్పష్టత
2006లో వ్యాపారవేత్త జీవన్ అప్పచ్చుతో తన వివాహం జరిగిందని, ఆ తర్వాత తలెత్తిన మనస్పర్థల కారణంగా పరస్పర అంగీకారంతో 2016లో ఫ్యామిలీ కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నట్లు తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటివరకు తాను ఒంటరిగానే జీవితాన్ని గడుపుతున్నానని వెల్లడించారు.
రెండో పెళ్లికి వయసుతో సంబంధం లేదు
పునర్వివాహంపై వస్తున్న ప్రశ్నలకు సమాధానమిస్తూ.. "జీవితంలో ఒక తోడు ఉండటం చాలా ముఖ్యం. నన్ను అర్థం చేసుకునే వ్యక్తి తారసపడితే 70 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి చేసుకోవడానికి వెనుకాడను. వివాహానికి వయసు పరిమితి ఉండదు, అది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం" అని కుండబద్దలు కొట్టారు.
క్యాన్సర్ వార్తలపై క్లారిటీ
గత కొంతకాలంగా తన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను ఆమె తీవ్రంగా ఖండించారు. తనకు క్యాన్సర్ వచ్చిందంటూ ప్రచారం జరుగుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని తేల్చిచెప్పారు. ఇంటర్నెట్‌లో కనిపించే నిరాధారమైన వదంతులను ఎవరూ నమ్మవద్దని ప్రేక్షకులను కోరారు.

