సన్యాసం తీసుకుంటా - రేణూదేశాయ్

Renoo Desai: దాదాపు రెండు దశాబ్దాల తర్వాత టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన నటి రేణూ దేశాయ్ తన భవిష్యత్తు కెరీర్, ఆధ్యాత్మిక ఆసక్తిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నటన తనకు ఇష్టమే అయినప్పటికీ, అదే తన జీవిత లక్ష్యం కాదని స్పష్టం చేశారు.

టైగర్ నాగేశ్వరరావు సమయంలో తనపై వచ్చిన విమర్శల గురించి రేణూ దేశాయ్ మాట్లాడారు. తాను ఇకపై అన్ని రకాల సినిమాల్లో నటిస్తానని కొందరు విమర్శలు చేశారని గుర్తుచేసుకున్నారు. "ఆ సినిమా విడుదలై రెండేళ్లు అవుతున్నా నేను మరే సినిమాలోనూ నటించలేదు, ఏ ప్రాజెక్టుకూ సంతకం చేయలేదు. నాడు విమర్శించిన వారు ఇప్పుడు వచ్చి క్షమాపణలు చెప్పరు కదా?" అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

డబ్బుకు ప్రాధాన్యం లేదు:

తాను డబ్బుకు ప్రాధాన్యం ఇచ్చే మనిషిని కాదని రేణూ దేశాయ్ తేల్చి చెప్పారు. నటననే కెరీర్‌గా కొనసాగించి ఉంటే ఇప్పటికి మంచి పేరు సంపాదించేదాన్ని అని అభిప్రాయపడ్డారు.

కొత్త ప్రాజెక్టు, ఆధ్యాత్మిక ఆసక్తి

ప్రస్తుతం తనకు మంచి పాత్రలు, మహిళా ప్రాధాన్యం ఉన్న కథలు వస్తున్నాయని రేణూ తెలిపారు. త్వరలోనే అత్తాకోడళ్ల మధ్య సాగే ఓ కామెడీ చిత్రంలో అత్త పాత్రలో నటించనున్నట్లు వెల్లడించారు. అయితే, నటన కంటే ఆధ్యాత్మిక మార్గంపై తనకు ఆసక్తి ఎక్కువని పేర్కొన్న ఆమె, భవిష్యత్తులో సన్యాసం తీసుకునే అవకాశం కూడా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story