‘Irumudi’: ఇరుముడి రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్..ఈనెల 10న గ్రాండ్ విజయోత్సవ వేడుక
విజయోత్సవ వేడుక

‘Irumudi’: మాస్ మహారాజా రవితేజ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన సెంటిమెంటల్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘ఇరుముడి’. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లతో ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా ‘జెనరేషనల్ బ్లాక్‌బస్టర్’ పేరుతో గ్రాండ్‌గా సక్సెస్ మీట్ నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇది తమ సొంత కథలా, తమ ఇంట్లోని ఆడపిల్ల మరియు అమ్మానాన్నల కథలా ఫీలవుతున్నారని తెలిపారు. రవితేజను ‘త్రినాథ్’ అనే వైవిధ్యమైన పాత్రలో ప్రేక్షకులు చూడటం చాలా బాగా వర్కవుట్ అయిందని చెప్పారు. మూడు జనరేషన్స్ కలిసి చూసే సినిమా కావడంతోనే దీనికి ‘జెనరేషనల్ బ్లాక్‌బస్టర్’ అనే పేరు పెట్టినట్లు ఆయన వెల్లడించారు.
నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ముందే ఉన్నప్పటికీ, ఊహించని విధంగా అద్భుతమైన ఫలితం వచ్చిందన్నారు. థియేటర్లకు వస్తున్న ఫుట్‌ఫాల్స్ సెన్సేషనల్‌గా ఉన్నాయని, ఒక్క నైజాంలోనే ఈ సినిమాను 42 లక్షల మంది ప్రేక్షకులు చూశారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
మరో నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ.. ‘ఇరుముడి’ విజయం ఒక మిరాకిల్ అని అభివర్ణించారు. రెండు మూడు వారాలకే సినిమాలు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో.. ఈ సినిమా ట్రెండ్‌ను పూర్తిగా మార్చేసిందని, రోజురోజుకీ దీనికి వస్తున్న ఆదరణ పెరుగుతోందని తెలిపారు. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ పట్ల చిన్నారి నటి బేబి నక్షత్రతో పాటు యూనిట్ సభ్యులంతా హర్షం వ్యక్తం చేశారు. ఈ చిత్ర విజయోత్సవ వేడుకను ఈ నెల 10న అత్యంత వైభవంగా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

