అనుపమ డేటింగ్ నిజమా.?

Anupama Really Dating: అనుపమ పరమేశ్వరన్.. ఈ మలయాళ భామకు కమర్షియల్ హిట్స్ లేకపోయినా, స్టార్ హీరోల సినిమాల్లో చేయకపోయినా చిన్న, మీడియం రేంజ్ వరుస సినిమాలు చేస్తూ, సోషల్ మీడియాలో తన ఫొటోలతో బాగానే ఫేమ్ తెచ్చుకుంది. గత కొన్ని రోజులుగా అనుపమ పర మేశ్వరన్ విక్రమ్ తనయుడు. హీరో ధృవ్ విక్రమ్ తో డేటింగ్ చేస్తుందని, ప్రేమలో ఉందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఓ ఈవెంట్లో అనుపమకి స్టేజిపై ధృవ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పగా అనుపమ సిగ్గుపడిన వీడియో బాగా వైరల్ అయింది.

ఇక వీరిద్దరూ తాజాగా మరో ఈవెంట్ లో కనిపిస్తే క్లోజ్ గా దిగిన సెల్ఫీలు వైరల్ గా మారాయి. ఈ సెల్ఫీలను ధృవ్, అనుపమ తమ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసారు. ఓ ఇంటర్వ్యూలో అర్ధరాత్రి కాల్ చేయాల్సి వస్తే ఎవరికీ చేస్తారు అని అడగ్గా అనుపమ ధృవ్ విక్రమ్ పేరే చెప్పింది. ఇలా వరుసగా పలు సంఘ టనలతో ఫ్యాన్స్, నెటిజన్లు వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అనుకుంటున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story