Meenakshi Chaudhary Really Marrying Sushanth: సుశాంత్ తో మీనాక్షి చౌదరి పెళ్లి నిజమేనా.?
మీనాక్షి చౌదరి పెళ్లి నిజమేనా.?

Meenakshi Chaudhary Really Marrying Sushanth: నటుడు సుశాంత్ నటి మీనాక్షి చౌదరి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వారు కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారని ఇటీవల సినీ వర్గాలలో వదంతులు వ్యాపించాయి. లేటెస్ట్ గా మీనాక్షి టీం ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది అవి వదంతులు మాత్రమేనని తెలిపింది. ఏదైనా సమాచారం ఉంటే అధికారికంగా తామే ప్రకటిస్తామని వివరణ ఇచ్చింది టీం. మీనాక్షి చౌదరి కూడా ఈ వార్తలను ఖండించారు. సుశాంత్‌తో నాకు మంచి స్నేహం ఉంది. మేము మంచి స్నేహితులం మాత్రమే. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు, వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవి," అని తెలిపారు.ఈ వదంతులపై సుశాంత్ స్వయంగా స్పందించారు. "నా పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఈ వార్తలను నమ్మవద్దు. అవన్నీ పూర్తిగా అవాస్తవం అని తెలిపారు.
వీరిద్దరూ కలిసి 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' అనే చిత్రంలో కలిసి నటించారు. బహుశా, ఆ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన స్నేహం కారణంగా ఈ ప్రచారం జరుగుతోంది. గతంలోనూ వీరి పెళ్లిపై వార్తలు రాగా మీనాక్షి ఖండించారు.ప్రస్తుతం, వీరిద్దరూ తమ తమ సినిమాల షూటింగ్‌లలో బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం సుశాంత్ ప్రధాన పాత్ర పోషిస్తున్న వెబ్ సిరీస్ 'మాన్షన్ 24' (Mansion 24) త్వరలో విడుదల కానుంది. ఇది ఒక హారర్ థ్రిల్లర్ సిరీస్. దర్శకుడు ఓంకార్ (Omkar).ఈ సిరీస్‌లో వరలక్ష్మి శరత్‌కుమార్, రావు రమేష్, సత్యరాజ్, అవసరాల శ్రీనివాస్ వంటి ప్రముఖ నటులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

