మరి ఎందుకు ప్రపోజ్‌ చేయలేకపోయాడు..?

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ క్రేజ్‌ మామూలుది కాదు. తమిళంలోనే కాదు, సౌత్‌ ఇండియాలో అంతటా ఆయనకు అభిమానులున్నారు. ఆ మాటకొస్తే ఉత్తరాదిలో కూడా రజనీ అంటే పడిచచ్చిపోయేవారు ఉన్నారు. అలాగే అతిలోక సుందరి శ్రీదేవికి కూడా ఇండియా అంతటా అభిమానులున్నారు. రజనీ- - శ్రీదేవి కలిసి నటించిన సినిమాలు చాలానే ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మూవీస్‌ కూడా పదుల సంఖ్యలో ఉంటాయి. ఇన్నాళ్లకు వీరిద్దరి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉండిందనే వార్త వెలుగులోకి వచ్చింది. బోనీకపూర్‌ను పెళ్లి చేసుకోవడానికి ముందు మిథున్‌ చక్రవర్తిని గాఢంగా ప్రేమించింది శ్రీదేవి. పెళ్లి కూడా చేసుకున్నారనే టాక్‌ అప్పట్లో వినిపించింది. అయితే ఇప్పుడు చాలా మందికి తెలియని విషయమేమిటంటే ఆరంభంలో రజనీకాంత్‌కు చాలా సన్నిహితంగా శ్రీదేవి మెలిగేదట! ఎవరో చెబితే ఈ మాట నమ్మేవాళ్లం కామేమో కానీ చెప్పింది సుప్రసిద్ధ దర్శకుడు కె.బాలచందర్‌ కాబట్టి నమ్మి తీరాలి. ఈ మాట చెప్పి కూడా చాన్నాళ్లే అయ్యింది. శ్రీదేవి అంటే రజనీకాంత్‌కు ఎంతో ఇష్టమట! పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయాడట! శ్రీదేవి గృహ ప్రవేశం వేడుక జరిగింది. ఆ సందర్భంగా తన మనసులో మాటను శ్రీదేవితో చెప్పాలనుకున్నాడు రజనీకాంత్‌. అయితే రజనీకాంత్ ఇంట్లో అడుగుపెట్టిన క్షణమే కరెంట్ పోయిందట! చెడు శకునంగా భావించాడట రజనీ. తన ప్రేమను మనసులోనే దాచిపెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడట! అన్నట్టు రజనీకాంత్‌కు శకునాల మీద నమ్మకం కాసింత ఎక్కువే! శ్రీదేవి తల్లికి కూడా రజనీకాంత్‌ ప్రేమ విషయం తెలుసట! ఇద్దరికి పెళ్లి చేయాలన్న ఆలోచనతో ఉండేవారట! గృహ ప్రవేశం రోజున రజనీతో మాట్లాడి పెళ్లి ఖరారు చేయాలని అనుకున్నారట! కాకపోతే అదే సమయంలో కరెంట్‌ పోవడం, ఇల్లంతా చీకటిమయం కావడంతో ఆమెకు కూడా అది అపశకునంగా అనిపించిందట! అయితే ఎప్పుడూ రజనీకాంత్‌ కానీ, శ్రీదేవి కానీ తమ ప్రేమ విషయాన్ని బయటకు చెప్పుకోలేదు.

Politent News Web 1

Politent News Web 1

Next Story