Special Song in ‘Peddi’: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పెద్ది' చిత్రం గురించి సోషల్ మీడియాలో వస్తున్న తాజా వార్తలపై స్పష్టత వచ్చింది. ఈ చిత్రంలోని ఒక ప్రత్యేక గీతం (Special Song) లో నటి సంయుక్త నటించబోతున్నారని, ఏప్రిల్ 22 నుండే ఆమె షూటింగ్‌లో పాల్గొంటారని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది.

ఈ స్పెషల్ సాంగ్ కోసం ఇప్పటివరకు ఏ నటిని ఖరారు చేయలేదని చిత్ర బృందానికి సన్నిహితంగా ఉండే వర్గాలు వెల్లడించాయి. గతంలో ఈ పాట కోసం మృణాల్ ఠాకూర్, నయన్ సారిక, మానస వారణాసి వంటి పేర్లు వినిపించగా, ఇప్పుడు సంయుక్త పేరు తెరపైకి వచ్చింది. అయితే, చిత్ర యూనిట్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు రావడం గమనార్హం.

నిజానికి ఈ ప్రత్యేక గీతం చిత్రీకరణను వచ్చే నెలలో నిర్వహించేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. నటి ఎంపికపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం.

వృద్ది సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన “చికిరి చికిరి”, “రాయ్ రాయ్ రా రా” పాటలతో పాటు రెండు వీడియో గ్లింప్స్‌లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ప్రస్తుతం శరవేగంగా పనులు జరుపుకుంటున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story