ఎల్లమ్మ డౌటేనా.?

Ellamma: దిల్ రాజ్ నిర్మాతగా నితిన్ హీరోగా బలగం ఫేమ్ వేణు డైరెక్షన్ లో ఎల్లమ్మ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గ్రామ దేవత ఎల్లమ్మ నేపథ్యంలో గ్రామీణ కథాంశంతో తీస్తున్నట్లు నితిన్ స్వయంగా వెల్లడించారు. ఇది తన కెరీర్‌లో జయం తర్వాత మళ్ళీ అంత లోకల్ రూటెడ్ సినిమా అని, ఇది తన కెరీర్‌లో ఒక మైలురాయి అవుతుందని చెప్పాడు.
అయితే ఈ మధ్య నితిన్ సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయి. చెక్, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్సట్రా-ర్డినరీ మాన్, రాబిన్‌హుడ్, తమ్ముడు ఇలా వరుసగా డిజాస్టర్ అయ్యాయి. సుమారు రూ.70కోట్లు ఖర్చు పెట్టి తీసిన తమ్ముడు వరల్డ్ వైడ్గా కేవలం రూ. 6.02 కోట్ల నెట్ మాత్రమే రాబట్టింది. దీంతో నితిన్ సినిమా కెరీర్ ప్రశ్నార్ధకంగా మారింది.
ఈ క్రమంలో ఎల్లమ్మ సినిమా భవిష్యత్తుపై కాస్త అనుమానాలు నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్కెట్ లేని నితిన్పై అంత బడ్జెట్ పెట్టేందుకు నిర్మాత దిల్ రాజు కాస్త ముందు వెనక ఆలోచన చేస్తున్నారని సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు.
