OG ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?

OG OTT Release Date: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ మాఫియా యాక్షన్ ఎంటర్‌టైనర్ 'OG' (They Call Him OG) బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం, పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచి, ఇప్పటివరకు రూ. 300 కోట్ల పైగా వసూళ్లు సాధించింది. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు (గ్రాస్) సాధించిన తెలుగు చిత్రంగా 'OG' నిలిచింది. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో పవర్ స్టార్ లుక్స్, యాక్షన్ సీన్స్, ఎలివేషన్లు ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి.

OG సినిమా ఈ నెల 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సినిమా థియేట్రికల్ విడుదలై నాలుగు వారాలు పూర్తయిన వెంటనే ఓటీటీలోకి తీసుకురావాలని నిర్మాతలు నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అయితే, ఈ స్ట్రీమింగ్ తేదీపై చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. మొత్తంగా, బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న 'OG' త్వరలో డిజిటల్ వేదికగా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. అధికారిక ఓటీటీ తేదీ ప్రకటన కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఓటీటీలో విడుదల కానున్న 'OG' వెర్షన్‌లో థియేటర్లలో కత్తిరించిన కొన్ని సన్నివేశాలు , అలాగే నేహా శెట్టి నటించిన ప్రత్యేక పాట (Special Song) కూడా ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇది పవన్ అభిమానులకు మరింత కిక్కిచ్చే అంశం. సినిమా సక్సెస్ మీట్‌లో హీరో పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజిత్‌లు 'OG' యూనివర్స్‌ను విస్తరిస్తామని ప్రకటించారు. ఈ చిత్రానికి ప్రీక్వెల్ మరియు సీక్వెల్ కూడా ఉండబోతున్నాయని స్పష్టం చేశారు. బాక్సాఫీస్ విజయం తమకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని, కథను మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story