Rajamouli Thanks His Team: అంతా మీ వల్లే.. తన టీమ్‌కు థాంక్స్ చెప్పిన రాజమౌళి
తన టీమ్‌కు థాంక్స్ చెప్పిన రాజమౌళి

Rajamouli Thanks His Team: ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన తాజా చిత్రం వారణాసి అనౌన్స్‌మెంట్ వీడియోకు వస్తున్న అద్భుత స్పందన పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అభిమానులకు కృతజ్ఞతలు చెప్పిన తర్వాత తాజాగా ఈ వీడియో విజయానికి కారణమైన తన సాంకేతిక బృందం కృషిని కొనియాడారు. ‘‘నా ఊహను మీ ముందుకు తీసుకురావడానికి సహాయపడిన నా అద్భుతమైన బృందానికి ధన్యవాదాలు. వారణాసి వీడియోకు జీవం పోశారు" అని అన్నారు.
అనౌన్స్‌మెంట్ వీడియో రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన వారి పేర్లను రాజమౌళి ప్రత్యేకంగా ప్రస్తావించారు
వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: శ్రీనివాస్ మోహన్
డీఓపీ : పీఎస్ వినోద్
ప్రొడక్షన్ డిజైనర్: మోహన్
సంగీత దర్శకుడు: కీరవాణి
కాస్ట్యూమ్ డిజైనర్: రమ
ఎడిటర్: తమ్మిరాజు
యానిమేషన్ సూపర్‌వైజర్: దీపక్
కాన్సెప్ట్ డిజైనర్: ప్రతీక్
వీఎఫ్ఎక్స్ సంస్థలకు ప్రత్యేక అభినందన
వీఎఫ్ఎక్స్ పని చేసిన సంస్థలను కూడా రాజమౌళి అభినందించారు. "మా అనౌన్స్‌మెంట్ వీడియోకు అద్భుతమైన వీఎఫ్ఎక్స్ అందించిన మిస్టీమ్యాన్ స్టూడియోస్‌కు, క్రియేటివ్ డైరెక్టర్ అలెక్స్‌పై.. అందరికీ నా థ్యాంక్స్" అని తెలిపారు. అలాగే చివరి నిమిషం వరకు మద్దతుగా నిలిచిన విస్కెఫీ, ఫాంటమ్ ఎఫెక్స్, గింప్‌విల్లే బృందాలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

