Rashmika: ఎనిమిదేళ్లుగా చాలా మిస్ అవుతున్నా : రష్మిక
చాలా మిస్ అవుతున్నా : రష్మిక

Rashmika: ఇటీవల 'ఛావా', 'కుబేర' మూవీలతో హిట్ ను సొంతం చేసుకున్న నటి రష్మిక. ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానాతో కలిసి 'థామా' అనే హారర్ కామెడీలో నటిస్తోంది. దీనితో పాటు 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీతో సిద్ధమవుతోంది. తాజాగా 'మైసా' అనే మూవీని కూడా ప్రకటించింది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ.. తన కుటుంబాన్ని మిస్ అవుతున్నట్లు చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మిక.. 'నాకు చెల్లి ఉంది. ఆమె నా కంటే 16 సంవత్సరాలు చిన్నది. ఇప్పుడు 13 ఏళ్లు. నా కెరీర్ ప్రారంభించిన తర్వాత ఎనిమిదేళ్లుగా ఆమెను మిస్ అవుతున్నాను. ఈ విషయంలో నాకు చాలా బాధగా ఉంది. అందుకే వీకెండ్ కోసం ఏడుస్తాను' అని చెప్పింది. కెరీర్లో రాణించాలంటే పర్సనల్ లైఫ్ను త్యాగం చేయాలని అమ్మ తనకు ఎప్పుడూ చెప్పేదని గుర్తు చేసుకున్న నటి.. తాను మాత్రం రెండింటి కోసం కష్టపడు తున్నట్లు తెలిపింది. ఏడాదిన్నర కాలంగా ఇంటికే వెళ్లలేదని ఆవేదన వ్యక్తం చేసింది. స్నేహితు లను కూడా చూడలేదని చెప్పింది. ఇంతకు ముందు టూరు వెళితే తనను కూడా భాగం చేసే తన స్నేహితులు కొంతకాలంగా తనకు విషయం చెప్పడమే మానేశారట. అలాగే ఈ అమ్మడు నటిస్తున్న కొత్త సినిమా ‘మైసా’ గురించి మాట్లాడుతూ.. ‘‘నేను ఎప్పుడూ మీకు కొత్తదనాన్ని.. భిన్నమైనదాన్ని.. ఉత్తేజకరమైన దాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇది అలాంటి వాటిలో ఒకటి. నేను ఇంతకు ముందు ఎప్పుడూ పోషించని పాత్రలో కనిపించబోతున్నా. ఎప్పుడూ అడుగుపెట్టని ప్రపంచంలోకి వెళ్తున్నాను. నేను చాలా భయానకంగా, చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఇది ప్రారంభం మాత్రమే’’ అని ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది.
