J. D. Chakravarthy Makes Interesting Comments: వైవిధ్యమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జేడీ చక్రవర్తి, సినీ పరిశ్రమలోని చీకటి కోణాలను బయటపెట్టారు. కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం మహిళలకు మాత్రమే పరిమితం కాదని, పురుషులు కూడా ఈ వేధింపులకు గురవుతున్నారని ఆయన స్పష్టం చేశారు.

ఆ హీరోయిన్ కోసం మంచం కింద దాక్కున్నాం..

జేడీ చక్రవర్తి తన కెరీర్ ప్రారంభంలో జరిగిన ఒక విస్తుపోయే సంఘటనను గుర్తు చేసుకున్నారు. "ఒక సీనియర్ నిర్మాత నా స్నేహితురాలైన ఒక స్టార్ హీరోయిన్‌తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు.. నేను, నటుడు సురేశ్ ఆమె గదిలోని మంచం కింద దాక్కుని ఆ మాటలన్నీ విన్నాము. ఆ సమయంలో మాకు ఏం చేయాలో పాలుపోలేదు" అంటూ పరిశ్రమలో అప్పట్లో ఉన్న పరిస్థితులను వివరించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

మహేశ్వరితో పెళ్లి.. ఎందుకు ఆగిపోయిందంటే?

చాలా కాలంగా జేడీ చక్రవర్తి పెళ్లిపై వస్తున్న రూమర్లకు ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. సోషల్ మీడియాలో తనకు తెలియకుండానే తన పెళ్లిళ్లు జరిగిపోతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. ఇక నటి మహేశ్వరితో తనకున్న అనుబంధంపై స్పందిస్తూ.. "అప్పట్లో మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని భావించిన మాట వాస్తవమే. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ బంధం పెళ్లి వరకు వెళ్లలేదు" అని క్లారిటీ ఇచ్చారు.

వర్మకు కూడా కోపం వస్తుంది

తన గురువు రామ్ గోపాల్ వర్మ గురించి చెబుతూ.. వర్మ ఎప్పుడూ కూల్‌గా ఉంటారని అందరూ అనుకుంటారని, కానీ అది నిజం కాదని జేడీ అన్నారు. సత్య సినిమా షూటింగ్ సమయంలో వర్మ చాలా ఎమోషనల్ అయిన సందర్భాలు ఉన్నాయని, పని విషయంలో ఆయనకు కూడా కోపం వస్తుందని జేడీ చక్రవర్తి వెల్లడించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story