జబర్దస్త్ కమోడియన్

Jabardast Adire Abhi (Abhinaya Krishna): జబర్దస్త్ షో తో పాపులర్ అయిన అదిరే అభి(అభినయ కృష్ణ) డైరెక్ట్ చేస్తున్న సినిమాకు టైటిల్ అనౌన్స్ చేశారు. కామఖ్య అనే టైటిల్ తో వస్తున్నట్లు వెల్లడించారు. మిస్టీరియస్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది.

ప్రముఖ యాక్టర్ సముద్ర ఖణి, అభిరామి ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. ఆనంద్ శరణ్య, ప్రదీప్, ధన్ రాజ్, రాఘవ కీలకపాత్రల్లో నటిస్తుననారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని మేకర్స్ చెప్పారు. గ్యానీ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నారు.

అదిరే అభి జబర్దస్త్' షోలో ఒక టీమ్ లీడర్‌గా వ్యవహరించాడు. అతని టీమ్‌లో చాలా మంది కమెడియన్లుగా పరిచయం అయ్యారు. అతని స్కిట్‌లు, డైలాగ్ డెలివరీ,విభిన్నమైన కామెడీ స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అభి తన స్కిట్‌లలో తరచుగా సామాజిక అంశాలను, కుటుంబ సంబంధాలను, రోజువారీ జీవితంలోని సంఘటనలను హాస్యభరితంగా చూపించే వాడు.ప్రస్తుతం జబర్దస్త్ షో చేయడం లేదు. జబర్దస్త్ కాకుండా, అతను ఇతర టీవీ షోలలో కూడా కనిపించాడు. కొన్ని సినిమాలలో చిన్న పాత్రలలో నటించాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story