Jagapathi Babu Completes Dubbing for ‘Peddi’: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పెద్ది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగాన్ని పెంచింది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్‌ను మేకర్స్ పంచుకున్నారు.

అప్పలసూరిగా జగ్గు భాయ్ అదరగొట్టేయడం ఖాయం..

ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతి బాబు అప్పలసూరి అనే అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. తాజాగా ఆయన తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేసుకున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ తమ అధికారిక ఎక్స్ వేదికగా వెల్లడించింది. "మా జగపతి బాబు గారు అప్పలసూరిగా మారడం చూడండి. 'పెద్ది' కోసం ఆయన తన డబ్బింగ్ పూర్తి చేశారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో కలుద్దాం" అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు.

అంచనాలు పెంచేసిన ట్రైలర్.. స్పోర్ట్స్ డ్రామాగా పెద్ది

గ్రామీణ నేపథ్యంలో, భావోద్వేగాలు, యాక్షన్ కలబోతగా ఈ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు అద్భుతంగా మలిచినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ క్రికెట్, రెజ్లింగ్ వంటి వివిధ క్రీడల్లో రాణించే ఒక మల్టీ-టాలెంటెడ్ స్పోర్ట్స్ పర్సన్‌గా పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు.

రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, దివ్యేందు, బోమన్ ఇరానీ వంటి నటులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులను అలరించడానికి ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం జూన్ 4న థియేటర్లలోకి రాబోతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story