Jakanna’s Master Plan: జక్కన్న మాస్టర్ ప్లాన్.. 120 దేశాల్లో SSMB 29
120 దేశాల్లో SSMB 29

Jakanna’s Master Plan: దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ,సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో వస్తున్న SSMB29(వర్కింగ్ టైటిల్) సినిమా ఇప్పటికే ఇండియాలో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కెన్యాలో షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆ దేశ మంత్రి ముసాలియా ముదావాదిని మూవీ టీమ్ మర్యాదపూర్వకంగా కలిసింది.
పాన్ వరల్డ్ గా వస్తోన్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళికలు వేస్తున్నారు. హాలీవుడ్ సంస్థల సహకారంతో సినిమాను ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాల్లో విడుదల చేయనున్నారు.ఈ సినిమాకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇది 2026లో విడుదల కానుందని సమాచారం.
ఎమ్ ఎమ్ కీరవాణి మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా పృథ్వి రాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆఫ్రికా, అమెరికా , భారతదేశంలోని కొన్ని అటవీ ప్రాంతాల్లో జరిగింది.
ఈ సినిమా మహేశ్ బాబు కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా నిలవనుంది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి.
