శ్రీదేవి బాటలో దేవర బ్యూటీ..

Janhvi Kapoor Gives a Shock to Karan Johar: బాలీవుడ్‌లో జాన్వీ కపూర్ అడుగు పెట్టినప్పటి నుండి ఆమె కెరీర్ నిర్ణయాలన్నీ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జొహార్ కనుసన్నల్లోనే సాగేవి. ఆయనకు చెందిన ధర్మా ప్రొడక్షన్స్ ఆమెకు ప్రతి విషయంలోనూ మార్గదర్శిగా ఉండేది. అయితే ఇప్పుడు జాన్వీ ఆ గూటి నుండి బయటకు వచ్చి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని నిశ్చయించుకుంది.

ఎందుకు ఈ నిర్ణయం?

కరణ్ జొహార్ మద్దతు ఉండటంతో జాన్వీపై మొదటి నుండి నెపో కిడ్ అనే విమర్శ బలంగా ఉంది. కేవలం ధర్మా ప్రొడక్షన్స్ పరిధిలోనే ఉండిపోకుండా తన తల్లి అతిలోక సుందరి శ్రీదేవి లాగే సొంతంగా నిర్ణయాలు తీసుకుని పాన్-ఇండియా స్టార్‌గా ఎదగాలని జాన్వీ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఆమె కలెక్టివ్ ఆర్టిస్ట్ నెట్‌వర్క్ అనే కొత్త మేనేజ్‌మెంట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.

సౌత్ సినిమాలపై స్పెషల్ ఫోకస్

ప్రస్తుతం జాన్వీ కపూర్ దృష్టి మొత్తం టాలీవుడ్, సౌత్ చిత్ర పరిశ్రమలపైనే ఉంది. ఎన్టీఆర్ సరసన నటించిన దేవరతో జాన్వీకి సౌత్‌లో గ్రాండ్ వెల్కమ్ లభించింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్దిలో జాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది.

కెరీర్ గ్రాఫ్ మారుతుందా?

బాలీవుడ్ మేనేజ్‌మెంట్‌కు గుడ్‌బై చెప్పి, సౌత్ ప్యాన్-ఇండియా సినిమాలతో తన కెరీర్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాలని జాన్వీ వేస్తున్న ప్లాన్ చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే ఆమె తపనను అభిమానులు అభినందిస్తున్నారు.

వారసత్వ ముద్రను చెరిపేసుకుని, తన సొంత ప్రతిభతో మెప్పించేందుకు జాన్వీ వేస్తున్న ఈ అడుగులు ఆమెను ఏ స్థాయికి తీసుకెళ్తాయో వేచి చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story