Janhvi Kapoor: కోలీవుడ్లోకి జాన్వీ కపూర్ ఎంట్రీ.. స్టార్ డైరెక్టర్ వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్..
గ్రీన్ సిగ్నల్..

Janhvi Kapoor: భాషతో సంబంధం లేకుండా సౌత్ టూ నార్త్ వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్. అగ్ర హీరోల సరసన నటిస్తూనే, మరోవైపు యంగ్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇటీవలే ‘పెద్ది’ చిత్రంలో అచ్చియమ్మగా డీగ్లామర్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైనట్లు ఫిలింనగర్ సమాచారం.
జాన్వీ కపూర్ తమిళంలో ఒక వైవిధ్యమైన వెబ్ సిరీస్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు గట్టి ప్రచారం సాగుతోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా.రంజిత్ నిర్మించనున్న ఒక సరికొత్త వెబ్ సిరీస్‌లో నటించేందుకు జాన్వీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పా.రంజిత్ బ్రాండ్ నుంచి వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో దీనిపై ఇండస్ట్రీలో అప్పుడే ఆసక్తి మొదలైంది. ఈ ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్‌కు ప్రముఖ దర్శకుడు సర్కునమ్ దర్శకత్వం వహించనున్నారు. గతంలో రూరల్ బ్యాక్‌డ్రాప్ లవ్ స్టోరీలతో తనదైన ముద్ర వేసిన సర్కునమ్, ఇటీవలే అబ్బాస్, దుషారా విజయన్, అదితి బాలన్ ప్రధాన పాత్రల్లో ఎగ్జామ్ అనే సిరీస్‌ను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరి గ్రామీణ నేపథ్య కథలను అద్భుతంగా ఆవిష్కరించే సర్కునమ్ దర్శకత్వంలో.. గ్లామరస్ క్వీన్ జాన్వీ కపూర్ ఎలాంటి డిఫరెంట్ క్యారెక్టర్‌లో మెరవబోతుందో చూడాలి.

