క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ మారుతి

Japan Earthquake: బాహుబలి: ది ఎపిక్ సినిమా ప్రచారంలో భాగంగా జపాన్‌లో పర్యటిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ క్షేమంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం ఇటీవల జపాన్‌లో భూకంపమే. ప్రస్తుతం అక్కడి అభిమానులతో సందడిగా గడుపుతున్న ప్రభాస్ ఉన్న సమయంలోనే ఈ ప్రకృతి వైపరీత్యం చోటు చేసుకోవడంతో, సోషల్ మీడియాలో ఆయన క్షేమం గురించి పోస్టులు వెల్లువెత్తాయి.

ముఖ్యంగా ఒక అభిమాని ప్రముఖ దర్శకుడు మారుతిని ట్యాగ్ చేస్తూ.. "జపాన్‌లో భూకంపం వచ్చింది... మా హీరో ఎక్కడ..? ఎలా ఉన్నాడు?" అని ప్రశ్నించాడు. దీనికి దర్శకుడు మారుతి వెంటనే స్పందించారు. "ప్రభాస్‌తో ఇప్పుడే మాట్లాడాను. ఆయన పూర్తిగా క్షేమంగా ఉన్నారు. ఆందోళన చెందకండి" అని ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చారు. మారుతి నుండి వచ్చిన ఈ భరోసాతో ప్రభాస్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. డిసెంబర్ 12న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రభాస్ జపాన్‌లో ఉన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story