Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరోగా, బేబీ చిత్ర నిర్మాత ఎస్.కె.ఎన్, దర్శకుడు సాయి రాజేష్ కలయికలో తెరకెక్కుతున్న తాజా చిత్రం చెన్నై లవ్ స్టోరీ . ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తిరుపతిలో నిర్వహించిన ఒక ఈవెంట్‌లో జిగితార అనే మొదటి పాటను చిత్ర బృందం ఘనంగా విడుదల చేసింది.

శఆకట్టుకుంటున్న జిగితార

ప్రేమలో ఉన్న ఒక యువకుడి మనోభావాలను ఆవిష్కరించే ఈ మెలోడీ సాంగ్, విడుదలైన కొద్దిసేపట్లోనే సంగీత ప్రియులను విపరీతంగా ఆకర్షించింది..మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన ట్యూన్ ఈ పాటకు ప్రాణంగా నిలిచింది. ప్రముఖ గాయకుడు కార్తీక్ తన మధురమైన స్వరంతో ఈ పాటను అద్భుతంగా ఆలపించారు. ప్రేమలోని లోతును తెలియజేసేలా అనంత శ్రీరామ్ రాసిన లిరిక్స్ శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రానికి సాయి రాజేష్ కథను అందించగా, రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ లవ్ స్టోరీలో కిరణ్ అబ్బవరం సరసన శ్రీ గౌరీ ప్రియ కథానాయికగా నటిస్తోంది. పూర్తిగా ప్రేమ, కుటుంబ బంధాల చుట్టూ తిరిగే ఒక అందమైన రొమాంటిక్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

జూలై 24న గ్రాండ్ రిలీజ్

ప్రస్తుతం అన్ని పనులను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా విడుదలకు ముందే జిగితార పాట సూపర్ హిట్ అవ్వడంతో సినిమాపై అంచనాలు, బిజినెస్ బజ్ మరింత పెరిగాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story