మూడు రోజులు డెడ్ లైన్

Jr NTR Appears Before Delhi High Court: టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరు, ఫోటోలు, వీడియోలు, వాయిస్‌ను తన అనుమతి లేకుండా సోషల్ మీడియా, ఈ-కామర్స్ వేదికల్లో వాణిజ్య ప్రయోజనాలకు, ఇతర అవసరాలకు దుర్వినియోగం చేస్తున్నారని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌‌ను జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా ఏకసభ్య ధర్మాసనం సోమవారం విచారించింది. ఎన్టీఆర్ తరఫున అడ్వకేట్ సాయి దీపక్ వాదిస్తూ..వివిధ ఈ-కామర్స్ వెబ్‌‌సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌‌ఫామ్‌‌లలో ఎన్టీఆర్ ఫొటోలు, పేరు, గ్లామర్‌‌ను అనుమతి లేకుండా వాణిజ్యపరంగా వినియోగిస్తూ వ్యక్తిత్వ హక్కులను దెబ్బతీస్తున్నాయని, ఆయన పరువుకు భంగం కలిగిస్తున్నాయని కోర్టుకు చెప్పారు.ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు, జూనియర్ ఎన్టీఆర్ దావాను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్‌మీడియేటరీ గైడ్‌లైన్స్ & డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్-2021 కింద అధికారిక ఫిర్యాదుగా పరిగణించాలని ఆదేశించింది.

సోషల్ మీడియా, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు ఈ ఫిర్యాదుపై మూడు రోజుల్లోగా తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 22న జరగనుంది, ఆ రోజున కోర్టు సమగ్ర ఉత్తర్వులు జారీ చేయనుంది.ఇటీవల అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, నాగార్జున వంటి పలువురు సినీ ప్రముఖులు కూడా తమ వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story