తారక్ భుజానికి సర్జరీ

Jr NTR: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఒక ముఖ్యమైన వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో, అభిమానులలో ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల షూటింగ్ సమయంలో భుజానికి గాయపడిన తారక్, ఇవాళ హైదరాబాద్‌లోని ప్రముఖ కిమ్స్ (KIMS) ఆసుపత్రిలో మేజర్ సర్జరీకి సిద్ధమవుతున్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'డ్రాగన్' షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో ఎన్టీఆర్ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. మొదటగా వైద్యులు ఆయనకు కొన్ని వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే గాయం తీవ్రత దృష్ట్యా వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించిన నిపుణుల బృందం, భుజానికి శస్త్రచికిత్స తప్పనిసరి అని తేల్చింది. దీంతో ఎన్టీఆర్ టీమ్ అధికారికంగా ఈ విషయాన్ని
హైదరాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌లో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో తారక్‌కు ఈ శస్త్రచికిత్స జరగనుంది. ఆయన త్వరగా కోలుకోవడానికి అవసరమైన అన్ని రకాల అధునాతన వైద్య సదుపాయాలను ఆసుపత్రి వర్గాలు సిద్ధం చేశాయి. సర్జరీ విజయవంతం కావాలని, తమ అభిమాన హీరో క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ నందమూరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రార్థనలు చేస్తున్నారు.
శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను ఆయన అధికారిక బృందం ఎప్పటికప్పుడు విడుదల చేయనుంది. ఈ సర్జరీ కారణంగా 'డ్రాగన్' సినిమా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడే అవకాశం ఉంది.

