Jr. NTR–Trivikram Srinivas Movie: ఎన్టీఆర్,త్రివిక్రమ్ మూవీ టైటిల్ ఫిక్స్.?బర్త్ డే రోజు ప్రకటన
బర్త్ డే రోజు ప్రకటన

Jr. NTR–Trivikram Srinivas Movie: అరవింద సమేత' వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత.. మ్యాటినీ ఐడల్ ఎన్టీఆర్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ భారీ మైథలాజికల్ మూవీ రాబోతోంది!.పురాణాల్లో ‘గాడ్ ఆఫ్ వార్’గా వర్ణించిన కుమారస్వామి ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. గత ఏడాది కాలంగా ఈ ప్రాజెక్ట్ గురించి రకరకాల వార్తలు వస్తున్నా.. ఇప్పుడు ఫ్యాన్స్‌కు అసలైన గుడ్ న్యూస్ వచ్చేసింది. మే 20న ఎన్టీఆర్ బర్త్‌డే కానుకగా ఈ మూవీపై అధికారిక ప్రకటన రాబోతోంది. అదే రోజున టైటిల్‌తో పాటు షూటింగ్ వివరాలను కూడా రివీల్ చేయబోతున్నట్లు సమాచారం.
ఈ చిత్రానికి కుమారస్వామికి మరో పేరైన ‘షణ్ముఖుడు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఆ పాత్రలోని మల్టిపుల్ షేడ్స్‌ను ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా త్రివిక్రమ్ అద్భుతంగా డిజైన్ చేశారట. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. అటు వెంకటేష్‌తో ‘ఆదర్శ కుటుంబం’ పూర్తి చేయనున్న త్రివిక్రమ్.. త్వరలోనే ఈ మైథలాజికల్ వండర్ కోసం చేతులు కలపబోతున్నారు. వెండితెరపై తారక్ 'షణ్ముఖుడి'గా ఎలా కనిపిస్తారో చూడాలంటే మే 20 వరకు ఆగాల్సిందే!

