Jyothika: జ్యోతిక ఆసక్తికర వ్యాఖ్యలు.. సూర్య కంటే నా పారితోషికమే ఎక్కువ
నా పారితోషికమే ఎక్కువ

Jyothika: సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమలో మోస్ట్ లవబుల్ అండ్ ఇన్‌స్పైరింగ్ కపుల్స్ ఎవరంటే.. టక్కున గుర్తొచ్చే పేర్లు సూర్య జ్యోతిక. తెరపై ఈ జోడీ చేసే మ్యాజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఈ ఇద్దరి కెరీర్ ప్రారంభ రోజులకు సంబంధించి జ్యోతిక ఇటీవల పంచుకున్న కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కొన్నిసార్లు పరిస్థితులు ఎంతలా మారుతాయో చెప్పడానికి వీళ్ల ప్రయాణమే ఒక ఉదాహరణ అంటుంది ఈ బ్యూటిఫుల్ నటి. కెరీర్ తొలినాళ్లలో తాను స్టార్‌డమ్ సంపాదించుకున్న సమయంలో.. భర్త సూర్య కంటే తనకే మూడు రెట్లు ఎక్కువ పారితోషికం వచ్చేదని జ్యోతిక నవ్వుతూ గుర్తుచేసుకున్నారు.పూవెల్లమ్ కెట్టుప్పర్ సినిమాతో మొదలైన వీరి ప్రయాణం, ఆ తర్వాత 'కాకా కాకా' లాంటి బ్లాక్‌బస్టర్స్ వరకు ఎన్నో విజయాలను అందించింది.
అప్పట్లో సూర్య కంటే తాను ఎక్కువ సంపాదించిన మాట వాస్తవమని చెప్పిన జ్యోతిక.. కాలం మారిన తీరును వివరిస్తూ సరదాగా ఒక పంచ్ విసిరారు. 'మరి ఇప్పుడో?' అని అడిగితే.. 'అది కాస్తా ఇప్పుడు ముప్పై రెట్లు తక్కువైంది' అంటూ సూర్య ఎదురుగా ఉండగానే ఆమె నవ్వులు పూయించారు.
ఈ క్యూట్ అండ్ క్యూట్ కపుల్ జోకులు చూసి అభిమానులు సైతం ఫుల్ ఖుషీ అవుతున్నారు.
కేవలం పారితోషికాల గురించే కాదు.. సూర్యతో తన బంధం గురించి మాట్లాడేటప్పుడు జ్యోతిక కళ్లలో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. సూర్యను ఒక 'గ్రీన్ ఫ్లాగ్'గా అభివర్ణించిన ఆమె.. తమ సంసారంలో జెండర్ బేధాలు ఉండవని చెప్పారు. వంట చేయడం దగ్గరినుంచి పిల్లలను చూసుకోవడం వరకు ప్రతి పనిలోనూ ఇద్దరూ సమానమేనని, సూర్య లాంటి లైఫ్ పార్ట్నర్ దొరకడం తన అదృష్టమని తెలిపారు.

