K-Ramp Public Talk: కె-ర్యాంప్ పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే.?
పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే.?

K-Ramp Public Talk: కిరణ్ అబ్బవరం నటించిన 'కే-ర్యాంప్' (K-Ramp) సినిమా పబ్లిక్ టాక్ ప్రస్తుతం మిక్స్ డ్ టాక్ వస్తోంది . ఓవర్‌సీస్‌లో ప్రీమియర్ షోలు, మొదటి రోజు ప్రదర్శనలను చూసిన వాళ్లు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు చేసుకుంటున్నారు.
పాజిటివ్ పాయింట్స్
కిరణ్ అబ్బవరం నటన: సినిమాకు వన్ మ్యాన్ షోగా నిలిచాడని, ముఖ్యంగా కామెడీ టైమింగ్, మాస్ ఎలిమెంట్స్ ఉన్న సీన్లలో ఆకట్టుకున్నాడని అంటున్నారు. ఎమోషనల్ సీన్లలో కూడా మెప్పించాడు.
ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ బాగా వర్కవుట్ అయిందని చాలామంది అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా హీరోకు ఉన్న Post Traumatic Stress Disorder (PTSD) నేపథ్యంలో వచ్చే కామెడీ సీన్లు బాగున్నాయని అంటున్నారు.దీన్ని ఫన్ ఎలిమెంట్స్‌తో కూడిన మాస్ ఎంటర్‌టైనర్‌గా అభివర్ణిస్తున్నారు, ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌కి నచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
నెగటివ్ పాయింట్స్
కొంతమంది ప్రేక్షకులు డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉన్నాయని, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు కొంత ఇబ్బంది కలిగించవచ్చని అంటున్నారు. సినిమా మ్యూజిక్, పాటలు ఆశించిన స్థాయిలో లేవని, కొన్ని చోట్ల ఫీల్ మిస్ అయ్యిందని కొందరి అభిప్రాయం.కథాంశం రొటీన్‌గా, కొన్ని సన్నివేశాలు ఊహించడానికి వీలుగా (Predictable) ఉన్నాయని, కొన్ని చోట్ల సినిమా టెంపో నెమ్మదించిందంటున్నారు.సినిమానుఓకే ఓకే మూవీ లేదా వన్ టైమ్ వాచ్ అని చెబుతున్నారు.కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్‌కు, మాస్ ఆడియన్స్‌కు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది, కానీ సగటు ప్రేక్షకులకు మిక్స్ డ్ అనుభూతిని ఇస్తుంది.
