Kajal Aggarwal: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్ తివారీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం రామాయణం. ఇండియన్ సినిమా హిస్టరీలోనే భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కి సంబంధించి ఒక బిగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో నటిస్తున్నట్లు వస్తున్న వార్తలపై స్వయంగా క్లారిటీ ఇచ్చారు.

ఇటీవల జరిగిన ఒక అవార్డుల వేడుకలో పాల్గొన్న కాజల్.. తాను ఈ భారీ ప్రాజెక్టులో భాగమైనట్లు అధికారికంగా ధృవీకరించారు. ఈ సినిమాలో నటించడం పట్ల ఆమె ఎంతో ఆసక్తిగా, ఆనందంగా ఉన్నట్లు వెల్లడించారు.

రావణుడి భార్యగా చందమామ..

ఈ పౌరాణిక చిత్రంలో కాజల్ అగర్వాల్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. లంకాధిపతి అయిన రావణాసురుడి భార్య మండోదరి పాత్రను ఆమె పోషిస్తున్నారు. తన నటనతో మెప్పించడానికి కాజల్ సిద్ధమవుతున్నారు.

ఈ సందర్భంగా కాజల్ మాట్లాడుతూ.. "భారతదేశంలో ఇంతకుముందెన్నడూ చూడని అద్భుతమైన సాంకేతికతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇలాంటి గొప్ప విజువల్ ఎపిక్‌లో భాగమవ్వడం నా కెరీర్‌లో ఒక మైలురాయిలా నిలిచిపోతుంది" అని ఎమోషనల్ అయ్యారు.

రామాయణం భారీ తారాగణం

దర్శకుడు నితేష్ తివారీ ఈ సినిమా కోసం భారతీయ చిత్ర పరిశ్రమలోని టాప్ స్టార్స్‌ను రంగంలోకి దించారు. ఈ చిత్రంలో ఎవరెవరు ఏ పాత్రలు పోషిస్తున్నారంటే:

శ్రీరాముడు: బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్

సీతాదేవి: సౌత్ నేచురల్ బ్యూటీ సాయిపల్లవి

రావణాసురుడు: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (KGF ఫేమ్)

హనుమంతుడు: యాక్షన్ కింగ్ సన్నీ డియోల్

రెండు భాగాలుగా విడుదల.. దీపావళి టార్గెట్..

ఈ దైవిక మహా కావ్యాన్ని దర్శకుడు రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం..

మొదటి భాగం: 2026 దీపావళి కానుకగా భారీ ఎత్తున విడుదల కానుంది.

రెండూ భాగం: 2027లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం, భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా మరో మెట్టు ఎక్కించడం ఖాయంగా కనిపిస్తోంది. కాజల్ ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్ ప్రేక్షకులలో కూడా మరింత హైప్ క్రియేట్ అయింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story