Kajal Aggarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి, మాతృత్వం తర్వాత కూడా సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతోంది. అయితే తల్లి అయ్యాక సినిమాల ఎంపిక విషయంలో తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చుకున్నట్లు ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. తన కుమారుడు నీల్ పెద్దయ్యాక.. అమ్మ సినిమాలు చూసి గర్వపడేలా ఉండే పాత్రలనే ఇకపై ఎంచుకోనున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం కాజల్ నటిస్తున్న రెండు క్రేజీ ప్రాజెక్టులకు సంబంధించిన ఆసక్తికర విశేషాలు..

ది ఇండియా స్టోరీ

చేతన్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సస్పెన్స్ డ్రామాలో కాజల్ అగర్వాల్ ఒక పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపిస్తోంది. శ్రేయస్ తల్పడే కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కల్తీ ఆహారం, పురుగుమందుల ప్రభావం వంటి సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. "ఈ కథ విన్నాక ఒక తల్లిగా నా ఆలోచనలు మారాయి. ప్రస్తుతం మా ఇంట్లో వాడే ఆహార పదార్థాల విషయంలో మునుపటి కంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను" అని కాజల్ తెలిపింది.

నితేష్ తివారీ రామాయణ

రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా చిత్రంలో కాజల్ అగర్వాల్ మండోదరి పాత్రను పోషిస్తోంది. ఈ సినిమా గురించి కాజల్ కొన్ని సరదా విషయాలను పంచుకుంది.

రావణుడంటేనే ఇష్టం:

తన కొడుకు నీల్‌కు చిన్నప్పటి నుంచే రామాయణ కథలంటే ఇష్టమని.. అయితే చిత్రంగా వాడు శ్రీరాముడి కంటే రావణుడి పాత్రకే ఎక్కువ ఆకర్షితుడవుతాడని నవ్వుతూ చెప్పింది. రామాయణ రెండో భాగం థియేటర్లలోకి వచ్చేసరికి నీల్‌కు ఐదేళ్లు నిండుతాయని, థియేటర్‌లో వాడు చూడబోయే మొదటి సినిమా ఇదే అవుతుందని కాజల్ ఆనందం వ్యక్తం చేసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story