క‌ల్పిక తండ్రి స్టేట్‌మెంట్

Kalpika’s Father Reveals: నటి కల్పిక గణేష్ ప్రవర్తన గత కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో, ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేసి ఒక సంచలనాత్మక ప్రకటన చేశారు. ఈ ఫిర్యాదులో, ఆయన తన కూతురికి 'మెంటల్ డిజార్డర్' (మానసిక రుగ్మత) ఉందని పేర్కొన్నారు. కల్పిక గణేష్‌కు మానసిక రుగ్మత ఉందని, ఆమె తనను తాను గాయపరుచుకునే, ఇతరులకు ప్రమాదం కలిగించే స్వభావం కలిగి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. గతంలో కల్పిక రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసిందని, అందుకే ఆమెను ఒక రిహాబిలిటేషన్ సెంటర్‌కు పంపించామని తెలిపారు. రెండేళ్ల క్రితం కల్పిక మెడికేషన్ తీసుకోవడం మానేసిందని, అప్పటి నుంచి ఆమె డిప్రెషన్‌లో ఉండి తరచూ గొడవలు చేయడం, అసభ్యకరంగా ప్రవర్తించడం వంటివి చేస్తోందని చెప్పారు. తన కూతురు వల్ల ఆమెకు, కుటుంబ సభ్యులకు, ప్రజలకు కూడా ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కల్పికను తిరిగి రిహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను లిఖితపూర్వకంగా కోరారు. ఈ ప్రకటన తర్వాత కల్పిక మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇటీవల ఆమె ఒక పబ్‌లో, అలాగే ఒక రిసార్ట్‌లో చేసిన హంగామాలు పోలీసు కేసుల వరకు వెళ్లాయి. ఈ సంఘటనల నేపథ్యంలో ఆమె తండ్రి చేసిన ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కాగా కల్పిక గణేష్‌ 2009లో చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన 'ప్రయాణం' సినిమాతో నటిగా పరిచయమైంది. ఈ సినిమాలో ఆమె పోషించిన మోక్ష పాత్రతో మంచి గుర్తింపు పొందింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంతకు అక్క పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ పాత్రతో ఆమెకు మంచి పేరు వచ్చింది. సినిమాలతో పాటుగా, కల్పిక గణేష్ వెబ్ సిరీస్‌లలో కూడా నటించి తన నటనను ప్రదర్శించింది. 'ఎక్కడికి ఈ పరుగు', 'లూజర్' మరియు 'దయా' వంటి వెబ్ సిరీస్‌లు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. తెలుగుతో పాటుగా తమిళంలో 'పెరోల్' , హిందీలో '8 ఎ.ఎం. మెట్రో' వంటి చిత్రాలలో కూడా నటించింది.Kalpika’s Father Reveals: “My Daughter is Suffering from a Mental Disorder”

PolitEnt Media

PolitEnt Media

Next Story